V మూవీ ట్రైలర్ టాక్: సైకో కిల్లర్‌గా భయపెడుతున్న నాని.. సుధీర్ బాబు పవర్‌ఫుల్ యాక్షన్
నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం V మూవీ అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా రిజల్ట్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక సెప్టెంబర్ 5న రానున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ట్రైలర్ పై ఒక లుక్కేస్తే..

సైకోలు పాపులారిటీ కోసమే..
'హలో హలో హలో.. మైక్ టెస్టింగ్ 1 2 3.. 123..' అంటూ నాని డైలాగ్ తో మొదలయ్యే ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా కొనసాగిగింది. డైలాగ్స్ తో పాటు సరికొత్త యాక్షన్ సీక్వెన్స్ తో దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి మొదటిసారి ఒక భారీ ప్రయోగమే చేశాడు. ''జనరల్ గా ఇలాంటి సైకోలు పాపులారిటీ కోసమే ఇలాంటి పనులు చేస్తుంటారు'' అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ ని బట్టి అతని పాత్ర కూడా చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తోంది.

మెయిన్ బిజినెస్ వేరే ఉంది'
నాని కోసం వెతికే ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో సుధీర్ బాబు కనిపించాడు. సుధీర్ బాబు కెరీర్‌లో ఈ పాత్ర ది బెస్ట్ అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. అందుకు తగినట్టే సుధీర్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొంటునేలా ఉంది. ఇక నాని మొదటి సారి ఒక డిఫరెంట్ సైకో పాత్రలో కనిపిస్తున్నట్లు చాలా క్లియర్ గా అర్థమవుతోంది. 'ఏ పని చేసినా సరే ఎంటర్టైనింగ్ గా చేయాలనేదే నా పాలసీ..' 'ఇది సైడ్ బిజినెస్.. మెయిన్ బిజినెస్ వేరే ఉంది' అనే డైలాగ్స్ వింటుంటే తప్పకుండా ఊహించని ట్విస్ట్ లు ఉన్నాయని కూడా అనిపిస్తోంది.

ఓ వైపు డైలాగ్స్ మరోవైపు చేజింగ్ సీన్స్,
ఓ వైపు డైలాగ్స్ మరోవైపు చేజింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ సినిమాపై అంచనాల డోస్ ని పెంచుతున్నాయి. దానికి తోడు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్త ఫీల్ ని కలిగిస్తోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నాని చేస్తున్న V సినిమా ప్రైమ్ లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని ట్రైలర్ తోనే అర్ధమవుతోంది.
అంతకు మించి అనేలా..
ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, సైకో కిల్లర్ కి మధ్య ఛాలెంజింగ్ గా సాగే సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ నాని అంతకు మించి అనేలా ఎదో చూపిస్తున్నాడని అనిపిస్తోంది. అందుకే ట్రైలర్ చివరలో 'మళ్ళీ ఎక్సపెక్టేషన్స్ కి మ్యాచ్ కాలేదనే మాట రాకూడదు' అనే డైలాగ్ ని వాడేశారని అనిపిస్తోంది. ఇక అమిత్ త్రివేది ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా దిల్ రాజు సినిమాను నిర్మించారు. నివేత థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటించారు.


Click it and Unblock the Notifications











