సుధీర్ బాబు కొత్త చిత్రం.. హీరోయిన్ ఖరారు!
హీరో సుధీర్ బాబు సమ్మోహనం చిత్రంతో ఇటీవలే మంచి విజయం సొంతం చేసుకున్నాడు. సుధీర్ బాబు కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు చేయాలని సుధీర్ బాబు భావిస్తున్నాడు. అందుకే సమ్మోహనం లాంటి క్లీన్ మూవీలో నటించాడు.
ప్రస్తుతం సుధీర్ బాబు నన్ను దోచుకొందువటే అనే రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మరో చిత్రానికి కూడా సుధీర్ బాబు సైన్ చేశాడు. కొన్ని రోజుల క్రితం దర్శకుడు పులి వాసు చెప్పిన కథ నచ్చడంతో సుధీర్ బాబు ఆ చిత్రాన్ని ఓకె చేసినట్లు తెలుస్తోంది.

త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రానికి తాజాగా హీరోయిన్ ఖరారైనట్లు తెలుస్తోంది. చాలా మంది హీరోయిన్లని పరిశీలించిన తరువాత మెహ్రీర్ ని ఎంపిక చేశారట. ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.


Click it and Unblock the Notifications











