సుధీర్ బాబు ప్యాన్ ఇండియా మూవీ.. డిసెంబర్‌లో సెట్స్‌లోకి..
టాలీవుడ్‌లో విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న యువ హీరో సుధీర్ బాబు ప్యాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేషనల్ బాడ్మింటన్ క్రీడాకారుడిగా సుధీర్ బాబు అందరికీ పరిచయమే. జాతీయ స్థాయిలో బాడ్మింటన్ డబుల్స్‌లో తన పార్ట్‌నర్ పుల్లెల గోపిచంద్‌తో సుధీర్ బాబు ఆడిన సంగతి తెలిసిందే.
అయితే కొన్నేళ్ల క్రితం తాను పుల్లెల గోపిచంద్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్టు సుధీర్ బాబు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్‌లోకి వెళ్లపోయింది. అయితే లాక్‌డౌన్ తర్వాత డిసెంబర్‌లో పుల్లెల గోపిచంద్ బయోపిక్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. V మూవీ ప్రమోషన్‌లో భాగంగా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. పుల్లెల గొపిచంద్ బయోపిక్ తన కెరీర్‌లో ప్యాన్ ఇండియా మూవీగా మారబోతున్నట్టు సుధీర్ బాబు వెల్లడించారు.
ఇక లాక్‌డౌన్‌లో చాలా కథలు విన్నాను. వాటిలో రెండింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన యూనిట్ త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడిస్తుందని చెప్పారు. ఇక ముందు సొంత నిర్మాణ సంస్థల్లోనే కాకుండా బయట నిర్మాణ సంస్థలు రూపొందించే చిత్రాల్లో నటించాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఇంద్రగంటి మోహన కృష్ణ, దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న V చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. నాని, అదితి రావు హైదరీ, నివేదా థామస్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన ఓటీటీ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











