గాల్లో ఆసనమేసుకుని కూర్చున్న యంగ్ హీరో.. వైరలవుతోన్న పిక్స్
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు తన కంటూ ఓ ప్రత్యేక బాటను క్రియేట్ చేసుకున్నాడు. యూత్ ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లతో ఆడియెన్స్‌కు దగ్గరవుతున్న సుధీర్ బాబు సమ్మోహనం, నన్ను దోచుకుందువటే లాంటి రొమాంటిక్ చిత్రాలతో మంచి విజయాలను అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.
హీరోగానే కాకుండా సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌ను స్థాపించి చిన్న చిత్రాలను కూడా తెరకెక్కిస్తున్నాడు. సుధీర్ బాబు తన తదుపరి చిత్రాల్లో బిజీగా ఉంటూ.. శరీర ఆకృతిని మార్చేసుకుంటున్నాడు. సుధీర్ బాబు ప్రస్తుతం వీ, పుల్లెల గోపీచంద్ బయోపిక్‌తో బిజీగా గడిపేస్తున్నాడు. స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ఆ పాత్రలో జీవించనున్నట్లు తెలుస్తోంది.

ఇక సమ్మోహనం లాంటి కూల్ హిట్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నాని నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. అయితే ఇంత బిజీగా ఉన్న సుధీర్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. తాను కసరత్తులు చేసే వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాడు. తాజాగా గాల్లో ఆసనమేసిన ఓ ఫోటోను షేర్ చేసి అందర్నీ షాక్‌కు గురి చేశాడు.


Click it and Unblock the Notifications











