For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శ్రీదేవి సోడా సెంటర్’కాలర్ ట్యూన్.. సుధీర్ బాబు ట్వీట్ వైరల్

    |

    సుధీర్ బాబు ఈ మధ్య వార్తల్లో బాగానే నిలుస్తూ వస్తున్నాడు. అయితే V చిత్రంతో సుధీర్ బాబు ఓ రేంజ్‌లో పేరు వస్తుందని అంతా ఊహించారు. కానీ V చిత్రం ఆశించినంతగా ఆడకపోవడంతో సుధీర్ బాబు పడ్డ కష్టం వృథా అయింది. నాని, సుధీర్ బాబు పాత్రలు క్లిక్ అయ్యాయి. అయితే ఈ సినిమా మిగిల్చిన ఫలితాన్ని మరిచిపోయేలా సుధీర్ బాబు అదిరిపోయే కాన్పెప్ట్‌తో రాబోతోన్నట్టు కనిపిస్తోంది.

    సుధీర్ బాబు కొత్త చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్' మోషన్ పోస్టర్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. లైట్స్ ఫిట్టింగ్ చేసేవాడిగా సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. జాతరలో సోడా బండిని నడుపుకుంటూ లైట్స్ ఫిట్టింగ్స్ చేసే సూరి బాబు పాత్రలో సుధీర్ బాబు దుమ్ములేపాడు. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్‌ను యూనిట్ మొదలెట్టేసింది.

    Sudheer Babu Sridevi Soda Center Caller Tune

    మోషన్ పోస్టర్‌లో మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. ఈ మేరకు దాన్ని కాలర్ ట్యూన్‌గా పెట్టుకోండని యూనిట్ ప్రచారాన్ని మొదలెట్టింది. సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ.. కాల్ చేసిన వాళ్లకి వెయిట్ చేసేటప్పుడు ఊపుండాలి.. మరి ఊపుండాలంటే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి.. అంటూ కాలర్ ట్యూన్ పెట్టుకోండిని ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ సినిమా మాత్రం సుధీర్ బాబు కెరీర్‌లో నిలిచే పోయేట్టు కనిపిస్తోంది.

    English summary
    Sridevi Soda Center Caller Tune, Call chesina vallaki wait chesetappudu oopundali .. mari oppundali ante Mani Sharma gari BGM undali
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X