Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘శ్రీదేవి సోడా సెంటర్’కాలర్ ట్యూన్.. సుధీర్ బాబు ట్వీట్ వైరల్
సుధీర్ బాబు ఈ మధ్య వార్తల్లో బాగానే నిలుస్తూ వస్తున్నాడు. అయితే V చిత్రంతో సుధీర్ బాబు ఓ రేంజ్లో పేరు వస్తుందని అంతా ఊహించారు. కానీ V చిత్రం ఆశించినంతగా ఆడకపోవడంతో సుధీర్ బాబు పడ్డ కష్టం వృథా అయింది. నాని, సుధీర్ బాబు పాత్రలు క్లిక్ అయ్యాయి. అయితే ఈ సినిమా మిగిల్చిన ఫలితాన్ని మరిచిపోయేలా సుధీర్ బాబు అదిరిపోయే కాన్పెప్ట్‌తో రాబోతోన్నట్టు కనిపిస్తోంది.
సుధీర్ బాబు కొత్త చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్' మోషన్ పోస్టర్ ఓ రేంజ్లో వైరల్ అయింది. లైట్స్ ఫిట్టింగ్ చేసేవాడిగా సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ఓ రేంజ్లో క్లిక్ అయింది. జాతరలో సోడా బండిని నడుపుకుంటూ లైట్స్ ఫిట్టింగ్స్ చేసే సూరి బాబు పాత్రలో సుధీర్ బాబు దుమ్ములేపాడు. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్‌ను యూనిట్ మొదలెట్టేసింది.
మోషన్ పోస్టర్లో మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ఓ రేంజ్లో క్లిక్ అయింది. ఈ మేరకు దాన్ని కాలర్ ట్యూన్‌గా పెట్టుకోండని యూనిట్ ప్రచారాన్ని మొదలెట్టింది. సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ.. కాల్ చేసిన వాళ్లకి వెయిట్ చేసేటప్పుడు ఊపుండాలి.. మరి ఊపుండాలంటే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి.. అంటూ కాలర్ ట్యూన్ పెట్టుకోండిని ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ సినిమా మాత్రం సుధీర్ బాబు కెరీర్లో నిలిచే పోయేట్టు కనిపిస్తోంది.