Sridevi Soda Center Glimpse: మరోసారి సిక్స్ ప్యాక్ తో అదరగొట్టిన సుధీర్ బాబు
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా సుధీర్ బాబు తన సొంత టాలెంట్ తోనే సోలోగా వెళుతున్నాడు. వీలైనంత వరకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటు కష్టపడుతున్నాడు. ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా సుధీర్ బాబు తన ఫిట్నెస్ తగో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాడు. కొన్ని సినిమాలు హిట్ కాకపోయినా కూడా అతని కష్టం వెండితెరపై కనిపిస్తున్నట్లు చాలా క్లియర్ గా అర్ధమవుతుంది.
ఇక చివరగా V సినిమాలో పవర్ఫుల్ పొలిసాఫీసర్ గా కనిపించిన సుధీర్ ఇప్పుడు మరో డిఫరెంట్ కంటెంట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. నేడు సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతని నెక్స్ట్ మూవీ 'శ్రీదేవి సోడా సెంటర్ టీజర్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయగా అది యూ ట్యూబ్ లో వైరల్ గా మారింది. కొన్ని నిమిషాల్లోనే ట్రెండ్ లిస్ట్ లోకి చేరిపోయింది.

పలాస సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సుధీర్ బాబు చాలాసార్లు తన ఫిట్నెస్ తో షాక్ ఇచ్చాడు. ఇక ఈసారి మరింత పవర్ఫుల్ సిక్స్ ప్యాక్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు.
చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. టీజర్ లో నాటుపడవలు.. నదికి సంబంధించిన విజువల్స్ ను అందంగా ప్రజెంట్ చేశారు. డైలాగ్స్ లేకున్నా కూడా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











