Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మోషన్ పోస్టర్‌తోనే హైప్ పెంచేశాడు.. ‘శ్రీదేవీ సోడా సెంటర్’లో సుధీర్ బాబు
సుధీర్ బాబు తన కొత్త సినిమాను ప్రకటించాడు. అది కూడా పలాస వంటి చిత్రాన్ని తీసి టాలీవుడ్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు మరో సాహసం చేయబోతోన్నాడు. పాత్ర కోసం ఎంతలా మారిపోవడానికైనా సిద్దపడే నటుల్లో సుధీర్ బాబు ఒకడు. చివరగా v చిత్రంతో అందర్నీ పలకరించాడు. అయితే ఇది ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదలైంది. సినిమా అంతగా మెప్పించకపోయినా సుధీర్ బాబు యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది.
సుధీర్ బాబు ఆ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. సిక్స్ ప్యాక్ బాడీతో పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా అదరగొట్టిన సుధీర్ బాబును తరువాతి చిత్రంలో లైట్స్ ఫిట్టింగ్ చేసేవాడిగా చూపించబోతోన్నాడు. జాతరలో సోడా బండిని నడుపుకుంటూ లైట్స్ ఫిట్టింగ్స్ చేసే సూరి బాబు పాత్రలో సుధీర్ బాబు నటించబోతోన్నాడు. ఈ మేరకు తాజాగా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
పలాస, మెట్రో కథలతో మంచి పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ చిత్రంతో మరోసారి పాత కాలంలోకి తీసుకెళ్లబోతోన్నట్టు కనిపిస్తోంది. రంగస్థలం సినిమాకు ఆర్ట్ డైరెక్టర్లుగా పని చేసిన రామకృష్ణ మోనికలు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇక మణిశర్మ సంగీతం మోషన్ పోస్టర్లోనే తెలిసిపోతోంది. ఈ సినిమా కచ్చితంగా ఓ మంచిప్రయోగం అవుతుందని అర్థమైపోతోంది.