twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోషన్ పోస్టర్‌తోనే హైప్ పెంచేశాడు.. ‘శ్రీదేవీ సోడా సెంటర్’లో సుధీర్ బాబు

    |

    సుధీర్ బాబు తన కొత్త సినిమాను ప్రకటించాడు. అది కూడా పలాస వంటి చిత్రాన్ని తీసి టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు మరో సాహసం చేయబోతోన్నాడు. పాత్ర కోసం ఎంతలా మారిపోవడానికైనా సిద్దపడే నటుల్లో సుధీర్ బాబు ఒకడు. చివరగా v చిత్రంతో అందర్నీ పలకరించాడు. అయితే ఇది ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదలైంది. సినిమా అంతగా మెప్పించకపోయినా సుధీర్ బాబు యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది.

    సుధీర్ బాబు ఆ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. సిక్స్ ప్యాక్ బాడీతో పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా అదరగొట్టిన సుధీర్ బాబును తరువాతి చిత్రంలో లైట్స్ ఫిట్టింగ్ చేసేవాడిగా చూపించబోతోన్నాడు. జాతరలో సోడా బండిని నడుపుకుంటూ లైట్స్ ఫిట్టింగ్స్ చేసే సూరి బాబు పాత్రలో సుధీర్ బాబు నటించబోతోన్నాడు. ఈ మేరకు తాజాగా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

    Sudheer Babu Sridevi Soda Center Motion Poster Viral

    పలాస, మెట్రో కథలతో మంచి పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ చిత్రంతో మరోసారి పాత కాలంలోకి తీసుకెళ్లబోతోన్నట్టు కనిపిస్తోంది. రంగస్థలం సినిమాకు ఆర్ట్ డైరెక్టర్లుగా పని చేసిన రామకృష్ణ మోనికలు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇక మణిశర్మ సంగీతం మోషన్ పోస్టర్‌లోనే తెలిసిపోతోంది. ఈ సినిమా కచ్చితంగా ఓ మంచిప్రయోగం అవుతుందని అర్థమైపోతోంది.

    English summary
    Sudheer Babu Sridevi Soda Center Motion Poster Viral, as Soori Babu Fire Here's Impressive First Look of #SrideviSodaCentre Talented karunafilmmaker 's film under HAT-TRICK SUPERHIT Production House 70mmentertains . #Manisharma at his usual best with the BGM.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X