దర్శకుడిగా మారుతున్న సుధీర్ బాబు.. ఆ కథపై ఫుల్ కాన్ఫిడెన్స్..
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. రొటీన్ గా కాకుండా ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త తరహా పాయింట్ తో ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్న సుధీర్ బాబు నెక్స్ట్ మరొక ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
చివరగా సుధీర్ బాబు నానితో V అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సారి అదే దర్శకుడితో మరొక విభిన్నమైన సినిమా చేస్తున్నాడు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే టైటిల్ కూడా సెట్ చేసుకున్నారు.

ఇక సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో సుధీర్ బాబు ఒక సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడట. రొమాంటిక్ క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కబోయే ఈ సినిమాపై దర్శకుడు అలాగే సుధీర్ బాబు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నారు. మరి సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











