కొట్టేసుకున్న యంగ్ హీరోలు.. వైరల్‌గా మారిన ట్వీట్

అష్టాచమ్మాతో నాని హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. సమ్మోహనం సినిమాతో సుధీర్ బాబుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే ఈ ఇద్దరి ఒకే స్క్రీన్‌పై తీసుకొస్తూ.. మరో బ్లాక్ బస్టర్‌ హిట్‌ను కొట్టేందుకు సిద్దమవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో వీ (V) అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నెగెటివ్ రోల్ పోషిస్తున్న నాని..

నెగెటివ్ రోల్ పోషిస్తున్న నాని..

హీరోగా నిలబెట్టిన దర్శకుడే.. విలన్‌గానూ మరో కొత్త పాత్రలో చూపించబోతోన్నాడు. ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారని సమాచారం. నెగెటివ్ షేడ్స్ లో సాగే నాని పాత్రపై ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకులలో ఆసక్తినెలకొంది.

పుకెట్‌లో షూటింగ్..

పుకెట్‌లో షూటింగ్..

ఈ మూవీ యూనిట్ థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్‌లో షూటింగ్ జరిపిన సంగతి తెలిసిందే.అక్కడి అందమైన లొకేషన్లలో పాటలను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఆ షెడ్యూల్‌ను ఎంతో ఎంజాయ్ చేశామని షూటింగ్ అనంతరం చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ప్రస్తుతం ముంబైలో..

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ముంబై వేదికగా వీరి మధ్య భీకరమైన ఫైట్ నడిచిందని సమాచారం. నానిని వెంటాడే పోలీస్‌గా సుధీర్ పాత్ర ఉంటుందని వినికిడి. వాటికి సంబంధించిన యాక్షన్ సీన్స్‌ను ముంబై వీధుల్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయిందని సుధీర్ చేసిన ట్వీట్ వైరల్ కాసాగింది.

Recommended Video

#CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
ఎన్నో క్యాలరీలు కరిగాయి..

ఎన్నో క్యాలరీలు కరిగాయి..

ముంబై షెడ్యూల్ పూర్తయింది..ఉఫ్.. ఎన్నో క్యాలరీలు కరిగిపోయాయి.. అంటూ పరోక్షంగా ఇద్దరికీ బాగానే ఫైటింగ్ జరిగిందని ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య గట్టిగానే ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఈ మూవీలో నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది మార్చ్ 25న ఉగాది కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X