కలుస్తాం మిమ్మల్ని మంచి కథతో.. ఇంద్రగంటితో సుధీర్ బాబు మూడో సినిమా
ఓ హీరోకు డైరెక్టర్‌తో సింక్ కుదిరాక వరుసగా సినిమాలు చేస్తుంటారు. అయితే ఇలాంటివి ఒకప్పుడు జరిగేవి. ఈ మధ్య అలాంటి జరగడం లేదు. కానీ సుధీర్ బాబు విషయంలో మాత్రం అదే జరుగుతోంది. సమ్మోహనం సినిమాతో ఈ ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ కాంబోపై అందరికీ అంచనాలు పెరిగాయి. ఈ కాంబోలోనే V చిత్రం కూడా వచ్చింది.
V చిత్రంలో అటు నాని, ఇటు సుధీర్ బాబుతో ఇద్దరితోనూ ఇంద్రగంటికి చాలా సింక్ ఉంది. ఎందుకంటే నానితో అష్టాచమ్మ, జెంటిల్‌మెన్ చిత్రాలు చేశారు. ఇలా V చిత్రంతో నాని హ్యాట్రిక్ కొట్టేశాడు. కానీ V చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ నాని, సుధీర్ బాబు పాత్రలకు మాత్రం మంచి పేర్లువచ్చాయి. అందుకే మళ్ల సుధీర్ బాబు ఇంద్రగంటితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

సుధీర్ బాబు, ఇంద్రగంటి కాంబోలో మూడో సినిమా రాబోతోంది. దీపావళి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు. ఈచిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలిపారు. ఇది సుధీర్ కెరీర్‌లో 14వ చిత్రంగా రాబోతోంది. ఈ మూవీపై సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ.. అద్భుతమైన టీం.. కలుస్తాం.. మిమ్మల్ని.. మంచి కథతో అని చెప్పుకొచ్చాడు. ఇదో రొమాంటిక్ డ్రామా అని తెలిపారు.


Click it and Unblock the Notifications











