twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసా?

    |

    సూపర్ స్టార్ మహేశ్ బాబు బావగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో మెప్పించిన అతడు.. స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బ్యాగ్రౌండ్ ఉన్నా ఎంతో కష్టపడే అతడు.. ఏకంగా బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి... అక్కడ పలు చిత్రాల్లో నటించాడు. తద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అయితే, అతడికి ఈ మధ్య కాలంలో హిట్ మాత్రం దక్కడం లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్.

    మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురుమితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

    ఇప్పటి వరకూ కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన సుధీర్ బాబు.. యాక్టర్‌గా తనను తాను మరింతగా నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా 'శ్రీదేవి సోడా సెంటర్'తో తొలిసారి ప్రేమకథను ట్రై చేశాడు. భారీ స్థాయి భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే టీజర్, ట్రైలర్‌తో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. దీంతో రిలీజ్‌కు ముందు ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సుధీర్ బాబు కెరీర్‌లో అత్యధిక థియేటర్లలో 'శ్రీదేవి సోడా సెంటర్' మూవీ విడుదలైంది.

    Sudheer Babus Sridevi Soda Center Streaming on ZEE5 From November 4th

    ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీదేవి సోడా సెంటర్' మూవీకి ఆరంభంలో మంచి టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ప్రతికూల పరిస్థితులకు తోడు టికెట్ రేట్ల ఇష్యూ ఉండడంతో కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. ఫలితంగా ముగింపు సమయానికి ఈ చిత్రం రూ. 5.34 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే దీనికి దాదాపు రూ. 3 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో సుధీర్ కెరీర్‌లో మరో ఫ్లాప్ చేరినట్లు అయింది.

    Bigg Boss 5 Telugu Wild Card Entry: ఎలిమినేట్ అయిన బ్యూటీకి బాస్ ఆఫర్.. షోలోకి ఆ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ!Bigg Boss 5 Telugu Wild Card Entry: ఎలిమినేట్ అయిన బ్యూటీకి బాస్ ఆఫర్.. షోలోకి ఆ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ!

    ఇక, 'శ్రీదేవి సోడా సెంటర్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 సంస్థ భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసినట్లు ఎప్పుడో ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఈ సినిమా దసరాకే స్ట్రీమింగ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఈ నేపథ్యంలో 'శ్రీదేవి సోడా సెంటర్' మూవీని దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు జీ5 సంస్థ తాజాగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లంతా ఖుషీ అవుతున్నారు.

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'శ్రీదేవి సోడా సెంటర్' మూవీలో తెలుగు అమ్మాయి ఆనంది హీరోయిన్‌గా నటించింది. కరుణ కుమార్ దర్శకత్వంలో 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

    English summary
    Sudheer Babu Recently Did a Film Sridevi Soda Center Under Karuna Kumar Direction. This Movie Streaming on ZEE5 From November 4th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X