టాలీవుడ్‌లో విషాదం...యంగ్ డైరెక్టర్ మృతి
ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. డైరెక్టర్ తన కోరిక తీరుతుందన్న ఉత్సాహం, సినిమా పూర్తవ్వబోతోందని సంతోషం మరో వైపు అన్నీ కలిసి ఓ డైరెక్టర్ ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసి డైరెక్టర్‌గా సత్తా చాటాలనుకున్న యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి షూటింగ్ ప్రమాదంలో చనిపోయాడు.
ఇఫ్పటి వరకు అసిస్టెంట్ డైరక్టర్‌గా వుంటూ, డైరక్షన్ చాన్స్ రాగానే సినిమాను దాదాపు పూర్తి చేసిన తరుణంలో మృత్యువు ముంచుకు వచ్చింది. డైరక్టర్ సుధీర్ వర్మ అసిస్టెంట్ ప్రవీణ్ ఈ రోజు షూటింగ్‌లో జరిగిన ప్రమాదం వల్ల మరణించారు. ఆయన రణరంగం తదితర సినిమాలకు సుధీర్ వర్మ దగ్గర పని చేసారు.

ఆహా ఓటిటిలో ఒక సినిమాకు డైరక్షన్ చాన్స్ వచ్చింది. ఆ మూవీని దాదాపు పూర్తి చేసారు. చివరగా షూటింగ్ జరుగుతుండగా కారు నడపాల్సిన సీన్ ఒకటి వచ్చింది. తానే చేసి చూపిస్తానని ముందుకు వచ్చాడట. అలా అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ మరణించారు. వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి ఆఖరికి ఓడిపోయారు. తన వద్ద పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ మరణించడంతో సుధీర్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.


Click it and Unblock the Notifications











