సుడిగాలి సుధీర్‌ని ఆటాడుకున్న సన్నీలియోన్.. బీర్లు పొంగిచి బాగా ఎంజాయ్ చేశాక!
బుల్లితెర కమెడియన్లు ఇప్పుడు వెండితెర జబర్దస్త్ హీరోలుగా మారిపోతున్నారు. రాణించే సత్తా ఉండాలే కానీ ఎక్కడైనా నెగ్గుకురావచ్చు అన్నట్లుగా వెండితెర ఆడియన్స్‌కి వినోదాల విందిస్తున్నారు. ఇప్పటికే షకలక శంకర్, చమ్మక్ చంద్ర లాంటి జబర్దస్త్ జోకర్లు వెండితెరపై కాలుమోపి అలరించగా ఇక సుడిగాలి సుధీర్ కూడా అదే బాటలోకి వచ్చేశాడు. ఈ మేరకు ఆయన చేస్తున్న తాజా సినిమా '3 మంకీస్'. ఈ సినిమాలో చాలా విశేషాలున్నాయండోయ్! ఆ వివరాలు చూద్దామా..

ఒకే ఫ్రేమ్‌లో 3 మంకీస్
నూతన దర్శకుడు అనిల్ దర్శకత్వంలో 3 మంకీస్ పేరుతో కొత్త సినిమా తెరకెక్కుతోంది. పేరుకు తగ్గట్టు ఈ సినిమాలో మూడు కోతులు ఉన్నాయి. అవే సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను. అయితే ఇది సినిమా కదా అందుకే పేర్లు కూడా మార్చుకున్నాయి ఆ కోతులు. సంతోష్, ఆనంద్, ఫణిలుగా ఒకే ఫ్రేమ్ లోకి వచ్చేశాయి.

మూడు కోతుల ఆగడాలు.. మాములుగా లేవుగా!
సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కలిసి నటిస్తున్న 3 మంకీస్ టీజర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. ఈ ట్రైలర్ లో మూడు కోతులుగా ఓ రేంజ్ హంగామా చేశారు ఈ ముగ్గురూ. చిత్రంలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించిన ఈ ముగ్గురు చేసే కోతి పనులు ట్రైలర్‌లో హైలైట్ సన్నివేశాలు. దీంతో ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది.
బీర్లు పొంగించారు.. సన్నీలియోన్‌ని తెచ్చుకున్నారు
సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. పైగా బ్యాచిలర్స్ కూడాను. ఇంకా చెప్పాలంటే కోతులు. ఇంకేముంది వీళ్ళ ఆగడాలు మామూలుగా ఉంటాయా? ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేసేశారు. బీర్లు పొంగించారు.. సన్నీలియోన్‌ని తెచ్చుకున్నారు.. ఇంకా సరదా సరదాగా చాలానే చేశారులే. ఇవన్నీ ట్రైలర్‌లో ఆకట్టుకునే సీన్స్. ఆ సీన్స్ మీరే చూడండి.

ఓ వైపు నాగబాబు, మరోవైపు వెంకటేష్
గతంలో 3 మంకీస్ ఫస్ట్ లుక్ విడుదల చేసి జబర్దస్త్ కామెడియన్లకు తమ సపోర్ట్ తెలిపారు మెగా బ్రదర్ నాగబాబు. ఇక ఇప్పుడు ఈ టీజర్ విడుదల చేసి విక్టరీ వెంకటేష్ వారికి అండగా నిలిచారు. ఈ జోష్ చూస్తుంటే ఈ ముగ్గురు కోతుల హంగామా థియేటర్స్‌లో నవ్వుల వర్షం కురిపించడం ఖాయం అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











