For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Gaalodu Movie Trailer: ఫస్ట్ టైమ్ ఊర మాస్ యాక్షన్ హీరోగా సుడిగాలి సుధీర్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

  |

  జబర్దస్త్ ద్వారా మంచి క్రియేట్ అందుకున్న కమెడియన్లలో సుడిగాలి సుదీర్ ఒకరు. అతను మొదటగా జబర్దస్త్ లో ఒక రైటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత వివిధ రకాల కామెడీ షోలు చేసుకుంటూ సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్న సుదీర్ ఇప్పుడు తనే హీరోగా సినిమా చేసే స్థాయికి వచ్చాడు. 'గాలోడు' అనే సినిమా చేసిన సుధీర్ అందులో ఒక ఊర మాస్ కమర్షియల్ హీరోగా కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమా త్వరలో విడుదలవుతున్న సందర్భంగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  సైడ్ రోల్స్ మాత్రమే కాకుండా

  సైడ్ రోల్స్ మాత్రమే కాకుండా

  సుడిగాలి సుదీర్ గా టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సుధీర్ సినిమాల్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. కేవలం సైడ్ రోల్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు హీరోగా కూడా అతను అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉండటం విశేషం. ఇంతకుముందే అతను హీరోగా కొన్ని సినిమాలు చేశాడు కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు గాలోడు అనే సినిమాతో సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.

  గాలోడు ట్రైలర్ రిలీజ్

  గాలోడు ట్రైలర్ రిలీజ్

  సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ జంటగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సంస్కృతీ ఫిలింస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై కొంత హైప్ అయితే పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందక్ 'గాలోడు' థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

  మాస్ లుక్ లో సుధీర్

  మాస్ లుక్ లో సుధీర్

  గాలోడు ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండబోతుందో మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. సుధీర్ ఫస్ట్ టైమ్ మాస్ లుక్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అలాగే డైలాగ్ సాంగ్స్ కూడా హైలెట్ అయ్యాయి. సుధీర్ తన స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. సప్తగిరి కామెడీ టైమింగ్ కూడా ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది.

  సుధీర్ ఊచకోత

  సుధీర్ ఊచకోత

  అల్లరిగా తిరిగే గాలోడు అనుకోకుండా ఒక కాలేజ్ అమ్మాయిని కలవడం ఆ తరువాత వారి మధ్యలో లవ్ ట్రాక్ స్టైలిష్ సాంగ్స్ కూడా హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఇక విలన్స్ ను సుధీర్ ఊచకోత కోయడం కూడా మాస్ ఆడియెన్స్ కు నచ్చేలా ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ విజువల్స్ అలాగే సంగీత దర్శకుడు భీమ్స్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అనిపిస్తోంది.

  సుధీర్ కెరీర్ లోనే గ్రాండ్ రిలీజ్

  ఇక సుడిగాలి సుధీర్ కెరీర్ లోనే ఇప్పటివరకు హై బడ్జెట్ మొవీగా 'గాలోడు' సినిమా తెరకెక్కినట్లు అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాను గత రెండు నెలల క్రితమే విడుదల చేయాలని అనుకున్నప్పటికి కుదరలేదు. ఇక మొత్తానికి నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సుధీర్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  సినిమాటోగ్రఫీ: సి రామ్ ప్రసాద్
  సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  ప్రొడక్షన్ కంట్రోలర్: బిక్షపతి తుమ్మల
  సమర్పణ: ప్రకృతి
  బ్యానర్: సంస్కృతి ఫిల్మ్స్
  దర్శకుడు: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

  English summary
  Sudigali sudheer upcoming movie gaalodu movie telugu trailer talk
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X