Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కప్ కొట్టినా... ఈ విషయంలో మాత్రం శివాజీ తోపు!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారాలపై సర్వేలు నిర్వహిస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా పొలింగ్ జరిపి ఈ సర్వే.. ప్రతి నెల, ప్రతివారం తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఆర్మాక్స్ సంస్థ మోస్ట్ పాపులర్ టెలివిజన్ పర్సనాలిటిస్ టాప్ 5 లిస్టును రిలీజ్ చేసింది. ఇందులో బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ఉండటం గమనార్హం. అయితే బిగ్ బాస్ విన్నర్ కంటే శివాజీ టాప్ లో ఉండటం విశేషం. అయితే ఈ లిస్టులో ఎవరు ఏ స్థానాన్ని కైవసం చేసుకున్నారో ఈ స్టోరీలో కులంకషంగా తెలుసుకుందాం.
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రతినెల, ప్రతి వారం సినీ తారాలపై ఏదో ఒకర సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా మోస్ట్ పాపులర్ టీవీ మేల్ యాక్టర్స్ ఎవరో లిస్టును రిలీజ్ చేసింది. ఇక ఈ లిస్టును తన సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ తో పంచుకుంది. ఇక ఈ లిస్టులో టాప్ 1గా సుడిగాలి సుధీర్ నిలిచాడు. సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆయన జబర్దస్త్ షోకి పుల్ స్టాప్ పెట్టేసి వెండితెరకు షిప్ట్ అయ్యాడు. ఇక వరుస సినిమాలతో బిజిగా మారిపోయాడు సుదీర్.

ఇక టీవీల్లో కనబడకపోయినా... టీవీ మోస్ట్ పాపులర్ జాబితాలో ఆయన టాప్ 1లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక టాప్ 2లో బిగ్ బాస్ షోలో అలరించిన హీరో శివాజీ నిలిచాడు. ఈయన బిగ్ బాస్ విన్నర్ అవుతాడని మొదటి నుంచి అంతా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా టాప్ 3లో నిలిచాడు. అయితే ఆర్మాక్స్ నిర్వహించిన మోస్ట్ పాపులర్ మేల్ పాపులర్ టీవీ యాక్టర్స్ లో టాప్ 2లో నిలిచాడు.
ఇక టాప్ 3లో హైపర్ ఆది నిలిచాడు. ఇక హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. హైపర్ ఆది జబర్ధస్త్ ప్రోగ్రాం ద్వారానే పాపులర్ అయి.. ఇప్పుడు సినిమాల్లో కమెడియన్ గా పాత్రలు పోషిస్తున్నాడు. ఇక టాప్ 4 లో పల్లవి ప్రశాంత్ నిలిచాడు. రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ గా నిలిచాడు. ఇక ఈయన కప్ కొట్టినప్పటికీ.. టాప్ 4 నిలిచాడు. అయితే అదే బిగ్ బాస్ హౌస్ లో టాప్ 3లో నిలిచిన శివాజీ ఆర్మాక్స్ లిస్టులో మాత్రం టాప్ 2లో నిలిచాడు.

ఇక టాప్ 5లో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నిలిచాడు.ఢీ వంటి బుల్లితెర షోస్ పాపులర్ అయిన శేఖర్ మాస్టర్.. వరుస సినిమాలతో స్టార్ కొరియోగ్రాఫర్ గా నిలిచాడు. ఆర్మాక్స్ నిర్వహించిన సర్వేలో టాప్ 5 మోస్ట్ పాపులర్ టీవీ యాక్టర్స్ ఇదే. మీ అభిమాన నటుడు ఎవరైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications











