Venkatesh Iyer సెంచరీ కొట్టగానే షారుక్ కూతురు ఏం చేసిందంటే? ఇషాన్ అవుట్వగానే సుహానా నోట అలాంటి బూతు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి సినీ పరిశ్రమను విడదీయలేమనే విషయం కాదనలేని వాస్తవం. పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో ప్రీతి జింటా, రాజస్థాన్ రాయల్స్‌తో శిల్పాశెట్టి, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో షారుక్ ఖాన్, జుహీ చావ్లా లాంటి వాళ్లు యాజమానులుగా ఉండటం తెలిసిందే. ఇక ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగుతున్న సమయంలో తారల సందడి భారీగా కనిపిస్తున్నది. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఎక్కడ జరిగినా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ చేసిన సందడి ఎలా ఉందంటే?
ముంబై మ్యాచ్‌లో సుహానా:ముంబైలో ఆదివారం (ఏప్రిల్ 16వ తేదీ) కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై జట్ల మధ్య రసవత్తరంగా మ్యాచ్ జరిగింది. ముంబై బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటూ కోల్‌కతా భారీ స్కోర్ చేసింది. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు వేగంగా పరుగులు చేసినప్పుడు.. సిక్స్‌లు, ఫోర్లు కొట్టినప్పడు సుహానా ఖాన్ తమ జట్టుకు చీర్స్ చెబుతూ కేరింతలు కొడుతూ బ్యాట్స్‌మెన్‌లో జోష్ పెంచింది.

వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్‌తో సుహానా జోష్:కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టులో వెంకటేష్ అయ్యర్ అద్బుతమైన ప్రతిభను చాటుకొన్నారు. తక్కువ పరుగులకే రెండు వికెట్లు పడిపోయిన సమయంలో వెంకటేష్ సంయమనంతో ఆడుతూ బోర్డుపై స్కోరును పరుగులు పెట్టించాడు. కేవలం 51 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 104 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ వేగంగా పరుగులు చేస్తుంటే సుహానా ఖాన్ ఉత్సాహంతో ఊగిపోయింది.
సెంచరీ కాగానే.. సుహానా :వెంకటేష్ అయ్యర్ వేగంగా సెంచరీ కొట్టడంతో సుహానా ఖాన్ ఉత్సాహానికి అడ్డులేకుండా పోయింది. వెంకటేష్ అయ్యర్ సెంచరీ చేయగానే.. పెవిలియన్‌లో ఉన్న జట్టు సభ్యులకు, తన అభిమానులకు చేతులు జోడించి నమస్కారం చేశాడు. అయితే వెంకటేష్ నమస్కారం చేయగానే.. సుహానా ఖాన్ చేతులు ఊపుతూ.. చిన్న ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసింది.

ఇషాన్ కిషన్‌పై కోపంతో సుహానా..:ఇక కోల్‌కత్తా విసిరిన టార్గెట్‌ను సునాయాసంగా ముంబై క్రికెటర్లు ఎదుర్కొంటూ ధాటిగా ఆటను ప్రారంభించారు. కోల్‌కత్తా బౌలర్లను ముంబైకి చెందిన ఇషాన్ కిషన్ చీల్చి చెండాడటంతో సుహానా ఖాన్ అసహానికి గురైంది. వరుణ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ 58 పరుగుల వద్ద అవుట్ కాగానే.. సుహానా Fuck అంటూ తనలోని ఒత్తిడిని తొలగించుకొన్నది. ఆ తర్వాత సంతోషంలో మునిగిపోయింది.
సుహానా బాలీవుడ్ ఎంట్రీ గురించి :ఇక సుహానా ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. కొద్దికాలంగా ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే వార్తలో ఊరిస్తున్నది. జోయా అఖ్తర్ దర్శకత్వంలో ది ఆర్చీస్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నది. ఆర్చీస్ కామిక్స్‌లోని క్యారెక్టర్ల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో రిలీజయ్యే ఈ చిత్రంలో ఖుషీ కపూర్, ఆగస్త్య నందాతో కలిసి సుహానా ఖాన్ నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











