Ambajipeta Marriage Band Teaser: అమ్మాయితో రొమాన్స్, ఆపై గుండు - మళ్లీ యాక్టింగ్ ఇరగదీశాడుగా!
Ambajipeta Marriage Band Teaser: కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న సుహాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతగాడు.. తన రెండో సినిమా రైటర్ పద్మభూషణ్ తోనూ అంతకు మించిన క్రేజ్ సంపాధించుకున్నాడు. ఈ సినిమా కూడా హిట్టవడంతో ఆయన రేంజ్ యే మారిపోయింది. అయితే సుహాస్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ విషయం తెలిసినప్పటి నుంచి సినీ ప్రేక్షకులంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. సుహాస్ హీరోగా మరో సినిమా అంటే కచ్చితంగా బాగుంటుందని ముందే సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు. ఈక్రమంలోనే అతడి కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా గురించి తెగ చర్చించుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన అప్ డేట్ల గురించి వేచి చూస్తున్నారు. ఇటీవలే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన వారంతా.. టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని గూగుల్ లో తెగ సెర్చ్ చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.

పూర్తిగా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కామెడీతో ప్రారంభమై మధ్యలో రొమాన్స్ ను టచ్ చేసి చివరకు ఎమోషనల్ గా ముగిసింది. చెప్పవే చిరుమానా అంటూ బ్యాండ్ మ్యూజిక్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో ముందుగా సుహాస్ లవ్ స్టోరీపై ఫోకస్ చేశారు. సుహాస్ మ్యారేజీ బ్యాండ్ లీడర్ మల్లి పాత్రలో నటించగా.. యాక్టింగ్ ఇరగదీశాడు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ కూడా అదిరిపోయింది. కామెడీ, ఫైట్, రొమాన్స్.. ఇలా అన్ని రసాలతో రంగరించిన ఈ సినిమా టీజర్ ను చూస్తే మంచి ఫీల్ వస్తుంది. అయితే టీజర్ చివరలో సుహాస్ గుండు గీయించుకోవడం టీజర్ కే హైలెట్ గా నిలిచింది.
సినిమా కోసం సుహాస్ గుండు కొట్టించుకోవడం చూస్తుంటే... సినిమాపై సుహాస్ ప్రాణం పెట్టాడని అర్థం అవుతోంది. గత చిత్రాల్లాగానే సుహాస్ కు ఈ సినిమా కూడా కెరియర్ గ్రాఫ్ గా నిలిచిపోతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. టీజర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేలల్లో కామెంట్లు వచ్చాయి. నటుడు గోపరాజు రమణ, పుష్ప ఫ్రేమ్ జగదీష్ బండారి కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎటాచ్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అలాగే వాజిద్ బేగ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాతో పాటు సుహాస్ రామ్ పసుపులేటి డైరెక్షన్ లో వస్తున్న ఆనందరావు అడ్వెంచర్స్ అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి చూడాలి ఈ రెండు చిత్రాల్లో సుహాస్ కెరియర్ గ్రాఫ్ ను పెంచుతాయో, తగ్గిస్తాయో.


Click it and Unblock the Notifications











