దిమ్మ తిరిగేలా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ట్రైలర్.. సుహాస్ మళ్లీ మ్యాజిక్ చేశాడుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న యంగ్ హీరోలు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో సుహాస్ ఒకడు. కమెడియన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన అతడు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అలా చక్కని గుర్తింపును తెచ్చుకున్న అనంతరం హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి చిత్రంతోనే హిట్ కొట్టిన సుహాస్ అప్పటి నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు.
హీరోగా పలు విజయాలను సొంతం చేసుకున్న సుహాస్ ఇప్పుడు నటించిన మరో చిత్రమే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ సినిమాను దుశ్యంత్ కటికనేని తెరకెక్కించాడు. ఇందులో సుహాస్ మ్యారేజీ బ్యాండులో పని చేసే వ్యక్తిగా, బార్బర్‌గా కనిపించబోతున్నాడు. దీంతో ఆరంభంలోనే ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి వచ్చి ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' ట్రైలర్‌ను వదిలారు.
తాజాగా విడుదలైన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' ట్రైలర్‌లో మ్యారేజ్ బ్యాండ్‌లో చేసే కుర్రాడిగా సుహాస్ కనిపించాడు. అతడు ఓ అమ్మాయితో ప్రేమలో పడడం.. అతడి అక్కను విలన్ గ్యాంగ్ వేధించడం వంటివి ఇందులో చూపించారు. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలను హై రేంజ్‌లో ఎలివేట్ చేశారు. అలాగే, భావోద్వేగాలను సైతం పొందుపరిచారు.
ఓవరాల్‌గా తాజాగా వచ్చిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ ట్రైలర్‌లో సుహాస్ మ్యాజిక్ చేసినట్లు అనిపించింది. ఇందులో కనిపించిన విజువల్స్, వినిపించిన బ్యాగ్రౌండ్ స్కోర్, హైలైట్ చేసిన సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' ట్రైలర్ వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీలో శివానీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











