twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవికి విజయశాంతి ఝలక్.. 32 ఏళ్ల తర్వాత మరో స్టార్‌ హీరోయిన్‌తో మెగాస్టార్!

    |

    మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను ప్లాన్ చేసుకొంటూ లాక్‌డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకొంటున్నారు. ఇండస్ట్రీలో సమస్యలను పరిష్కరిస్తూనే తదుపరి సినిమాల ప్లానింగ్‌పై ఫోకస్ పెట్టి ఎప్పుడంటే అప్పుడని షూటింగుకు సిద్ధమవుతున్నారు. సైరా తర్వాత ఆచార్య చిత్రంలో నటిస్తూనే లూసిఫర్ సినిమాపై కసరత్తు మొదలుపెట్టారు. లూసిఫర్‌లో ఓ కీలక పాత్ర కోసం 80 దశకాల్లో హిట్ పెయిర్‌గా మారిన హీరోయిన్‌ను కన్ఫర్మ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వివారాల్లోకి వెళితే..

    ఆచార్య తర్వాత లూసిఫర్‌తో

    ఆచార్య తర్వాత లూసిఫర్‌తో

    సైరా సినిమా తర్వాత ఆచార్య మూవీని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. అదే క్రమంలో శరవేగంగా షూటింగు నిర్వహించారు. అయితే షూటింగుకు కరోనా వైరస్ అడ్డు తగిలింది. దాంతో అన్ని సినిమాలతోపాటు నిరవధికంగా ఆచార్య షూటింగ్ నిలిచిపోయింది. ఈ క్రమంలో తన తదుపరి చిత్రం లూసిఫర్‌పై చిరంజీవి ఫోకస్ పెట్టారు.

    పొలిటికల్ థ్రిల్లర్‌గా

    పొలిటికల్ థ్రిల్లర్‌గా

    మలయాళ చిత్ర పరిశ్రమలో లూసిఫర్ అతిపెద్ద విజయాన్ని అందుకొన్నది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఆ చిత్రంలో మంజు వారియర్ కీలక పాత్రను పోషించింది. సినిమాను పెద్ద మొత్తంలో ప్రభావితం చేసే పాత్ర అది. ఆ పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించగా ఆ రోల్‌ను మారు మాట్లాడకుండా తిరస్కరించినట్టు సమాచారం. విజయశాంతి తిరస్కరించడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

    విజయశాంతి క్లారిటీ ఇస్తూ.

    విజయశాంతి క్లారిటీ ఇస్తూ.

    అయితే లూసిఫర్ చిత్రంలో పాత్రను నిరాకరించడానికి విజయశాంతి తన వాదనను వినిపించారట. 80 దశకంలో చిరంజీవితో తాను హీరోయిన్‌గా నటించాను. అయితే ఈ చిత్రంలో చెల్లెలు పాత్రను పోషించడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. అది ప్రేక్షకులు జీర్ణించుకోలేని విషయం. అందుకే తాను ఆ పాత్రను ఒప్పుకోలేదని తన సన్నిహితులతో వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.

    చెల్లెలి పాత్రలో సుహాసిని మణిరత్నం

    చెల్లెలి పాత్రలో సుహాసిని మణిరత్నం


    ఇక ఆ పాత్ర కోసం 80 దశకాల్లో చిరంజీవికి అద్బుతమైన జంటగా పేరు తెచ్చుకొన్న సుహాసినిని సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఒకవేళ సుహాసిని నటిస్తే దాదాపు 32 ఏళ్ల తర్వాత చిరంజీవితో మళ్లీ జతకట్టిన హీరోయిన్‌గా మారుతుంది. 1988లో చిరంజీవితో సుహాసిని మరణ మృదంగంలో నటించారు. ఆ తర్వాత వారిద్దరు కలిసి నటించిన దాఖలాలు లేవు.

    ఆగస్టులో అధికారికంగా

    ఆగస్టులో అధికారికంగా


    అయితే సుహాసిని ఎంపికతోపాటు ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఆగస్టులో అధికారికంగా వెల్లడిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ అన్నీ సర్దుకుంటే ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై స్వయంగా రాంచరణ్ నిర్మిస్తున్నారు.

    Recommended Video

    Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
    మలయాళంలో భారీ విజయంతో

    మలయాళంలో భారీ విజయంతో

    లూసిఫర్ చిత్రం విషయానికి వస్తే.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ డైరెక్టర్‌గా మారి రూపొందించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ హీరోగా నటించారుు. ఈ చిత్రంలో ఇంద్రజిత్ సుకుమార్, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది.

    English summary
    Suhasini Maniratnam has given green signal to Chiranjeevi's Lucifer Remake. She is acting with Chiranjeevi after 32 years for sister role Which Vijayashanthi rejects.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X