OG: పవన్ కోసం ప్లాన్ మార్చిన సుజిత్.. అవసరమైతే ఆ రిస్క్‌కు కూడా రెడీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సెన్సేషన్. అంతలా ఈ మెగా హీరో దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. మధ్యలో రాజకీయాల కోసం కాస్త విరామం తీసుకున్నా.. ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ఇప్పుడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అలా ఇప్పుడు పవన్ ఏకంగా నాలుగు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. అతడు ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రభాస్‌తో సాహో అనే చిత్రాన్ని తెరకెక్కించి సత్తా చాటిన సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రమే 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని షెడ్యూళ్లను విజయవంతంగా కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో 'వారాహి యాత్ర'ను చేస్తున్నాడు. ఈ కారణంగానే సినిమాలకు కాస్త విరామం తీసుకున్నాడు. దీంతో ఇప్పుడు సుజిత్ 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ షూట్‌ను పవన్ లేకుండానే చేసేలా ప్లాన్ చేసుకున్నాడని తెలిసింది. అంటే.. హీరోతో అవసరం లేని సన్నివేశాలను తాజా షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నాడట.
అంతేకాదు, జూలై 9 నుంచి జరిగే మరో షెడ్యూల్ కూడా పవన్ లేకుండానే చేస్తాడని సమాచారం. ఆ తర్వాత మాత్రం ఈ స్టార్ హీరో వీలును బట్టి హైదరాబాద్ లేదా మంగళగిరిలో షూటింగ్ జరిపేందుకు కూడా చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ఏపీలో షూటింగ్‌కు కాస్త ఎక్కువ ఖర్చు అయినా పవన్ కోసం భరించేందుకు నిర్మాత రెడీగా ఉన్నారని టాక్.

పవర్‌ఫుల్ స్టోరీతో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











