టాలీవుడ్ టాప్ హీరోతో సినిమా ఫ్లాప్ .. దారుణంగా డైరెక్టర్ కండీషన్ , ట్యూషన్లు చెప్పుకుని
చిత్ర పరిశ్రమలో ఎన్నో ఆశలు, అంచనాల మధ్య చేసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయితే ఆ దర్శక నిర్మాతల బాధ వర్ణనాతీతం. ఈ పరిణామాలు చివరికి వారి కెరీర్‌ను దెబ్బకొట్టి భవిష్యత్తు లేకుండా చేస్తాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఇది అనుభవమే. కొందరు కోలుకుని తిరిగి నిలబడితే.. మరికొందరు మాత్రం ఈ పోరాటంలో ఓడిపోయి ఇండస్ట్రీని వదిలేస్తారు. జీవితంలో తనకు ఇలాంటి పరిస్ధితే ఎదురైందని తెలిపారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ వివరాల్లోకి వెళితే..
సాధారణ లెక్కల మాస్టర్ స్థాయి నుంచి టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు సుకుమార్. రోటీన్ కమర్షియల్ ఫార్ములా కాకుండా విభిన్నమైన కథలతో తెలుగునాట క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సుక్కూ. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్యతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ .. అల్లు అర్జున్‌ను స్టైలీష్ స్టార్‌గా నిలబెట్టారు . ఆ తర్వాత తీసిన జగడం కమర్షియల్‌గా హిట్ కాకపోయినప్పటికీ సుకుమార్ టేకింగ్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఆర్య 2, 100% లవ్, రంగస్థలం, నాన్నకు ప్రేమతో సినిమాలు తీసి విజయం సాధించారు.

ఇక పుష్ప సిరీస్‌తో దేశాన్ని ఒక ఊపు ఊపారు సుకుమార్. రాజమౌళియే కాదు తాను కూడా పాన్ ఇండియా సినిమాలతో కలెక్షన్ల వర్షం కురిపించగలనని నిరూపించారు సుకుమార్. పుష్ప 1కి సీక్వెల్‌గా డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 వసూళ్ల వర్షం కురిపించింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి దాదాపు రూ.1870 కోట్ల కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో పుష్ప 2 రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సుకుమార్ జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటేడ్ డైరెక్టర్‌గా నిలిచారు. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారు.
ఇక సుకుమార్ రైటింగ్స్ పేరిట బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ సక్సెస్ కొట్టారు. అలాగే రామ్ గోపాల్ వర్మ మాదిరిగా తన శిష్యులను డైరెక్టర్‌లుగా మార్చేందుకు ఎంతో సాయం చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా , రైటర్‌గా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. సుకుమార్ డైరెక్షన్ అనగానే ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చేది ఆయన స్క్రీన్ ప్లే, డైలాగ్స్, టేకింగ్. అలాగే నేటితరంలో ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడిగా ఆయన తన మార్క్ వేశారు. ఆర్య నుంచి పుష్ప 2 వరకు ప్రతి చిత్రంలోనూ మాస్‌ను ఊపేసే ఐటెం సాంగ్స్‌తో ఆయన దుమ్మురేపారు.
ఎన్నో ఘనతలు సాధించిన సుకుమార్‌కు తన జీవితంలోనే తొలిసారిగా ఓ అగ్ర కథానాయకుడితో సినిమా తీసే ఛాన్స్ వచ్చేంది. అదే సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కించిన వన్ నేనొక్కిడినే. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. హాలీవుడ్ రేంజ్ టేకింగ్‌తో సుకుమార్ క్రియేటివిటీకి క్రిటిక్స్ ఆశ్చర్యపోయారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. వన్ నేనొక్కిడినే పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సుకుమార్‌కు ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పాటు భారీ నష్టాలను మిగల్చడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారట.
ఈ సమయంలో సుకుమార్‌క భార్య తబిత అండగా నిలిచారు. ఆమెకు సినిమాల గురించి పెద్దగా అవగాహన లేదు. భర్త అలా బాధపడుతుండటం చూసి ఇక సినిమాలు వద్దు, అన్ని మానేసి అమెరికా వెళ్లిపోదాం అక్కడ లెక్కలు చెప్పుకుంటే నెలకు లక్ష ఇస్తారని.. హ్యాపీగా బతికేద్దామని చెప్పారట. ఓ ఇంటర్వ్యూలో వన్ నేనొక్కిడినే తర్వాత జరిగిన విషయాలు చెబుతూ సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











