స్టైలిష్ స్టార్ కాదు.. అల్లు అర్జున్ ఇక నుంచి ఐకాన్ స్టార్.. సుకుమార్ ఎమోషనల్
స్టైలిష్ స్టార్ అనే టైటిల్ బన్నీకి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. కానీ పుష్ప చిత్రంలో అమేజింగ్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత స్టైలిష్ అనే పదంలో ఫెర్ఫార్మెన్స్ లేదనిపించింది. ఆయన ఎంచుకొనే సినిమాలు, పాత్రలు, డ్రస్సెస్‌లో యూనిక్ ఉంటుంది. ఈ సినిమా ద్వారా అద్బుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తున్నాం. అందుకే ఆయనను ఐకాన్ స్టార్ అంటాను. పుష్ప సినిమా చూసిన తర్వాత ఆయనను ఐకాన్ స్టార్ అంటారు అని సుకుమార్ అన్నారు.
ఇక పుష్ప సినిమా షూటింగులో మాకు ఎంతో సపోర్టుగా నిలిచిన మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పాలి. కొన్నిసార్లు సమయం లేకపోతే కొన్ని సీన్లు వదిలేద్దామనుకొంటే రేపు చేసుకోమని మాకు అండగా నిలిచారు అని సుకుమార్ తెలిపారు.

నా సినిమాటోగ్రాఫర్ కుబా ఏ దేశం నుంచి వచ్చారో తెలియదు కానీ.. నా సినిమాను పూర్తిగా అర్థం చేసుకొన్నారు. నా మాటలు ఆయనకు అర్థం కాదు. ఆయన మాటలు నాకు అర్థం కాదు. నా సినిమా కథ ఆయనకు అర్థం అయింది. అని అన్నారు.
అంతేకాకుండా సినిమాకు పనిచేసిన ప్రతీ టెక్నిషియన్‌ను పేరు పేరున దర్శకుడు సుకుమార్ అభినందించారు.


Click it and Unblock the Notifications











