Sukumar : సుకుమార్ ఎమోషనల్ .. సుక్కూ కెరీర్‌పై కొట్టిన ఆ హీరో సినిమా

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల జాబితాలో కొత్తగా చేరిన దర్శకుడు పేరు సుకుమార్ బండ్రెడ్డి. తనదైన సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ని ఓ రేంజ్ లో అలరించిన ఆయన ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ గ్రాసర్ ని కొట్టే దిశగా వెళ్లే రేంజ్ సినిమా తెరకెక్కించారు. తన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రమే పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన ఈ భారీ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సెట్ చేసింది.

కాగా ఈ చిత్రం సంగతి అటుంచితే సుకుమార్ ఇన్నేళ్ల కెరీర్‌లో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తన ప్రతీ సినిమా దేనికదే డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే తన మార్క్ ఇంటెలిజెన్స్ ప్రతీ సినిమాలో మంచి లాజిక్స్ గాని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ కానీ చాలానే కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే తన ప్లాప్ సినిమాలకి కూడా ఇప్పటికీ మంచి ఫేమ్ ఉంది.

sukumar emotional comments over his career end only this flop saved

అయితే సుకుమార్ కెరీర్‌లో ఎన్నో హిట్స్ ఇచ్చారు , ప్లాప్స్ కూడా ఇచ్చారు. కానీ ఓ ప్లాప్ తర్వాత మాత్రం తన కెరీర్ ముగిసిపోయినట్టే అని ఆయన దాదాపు ఫిక్స్ అయ్యిపోయారట. కాగా ఆ చిత్రం ఏదో కాదు అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా "1 నేనొక్కడినే". సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ఈ చిత్రం అప్పట్లో జనానికి ఎక్కలేదు. దీనితో భారీ అంచనాలు నడుమ వచ్చిన ఆ సినిమా దారుణమైన నష్టాలు మిగిల్చింది.

ఇది కెరీర్ పరంగా మహేష్ బాబుకి అలాగే సుకుమార్‌కి కూడా చాలా దెబ్బేసింది. అలాంటి సమయంలో తనకి ఎంకరేజ్మెంట్ వచ్చింది మాత్రం ఒక్క యూఎస్ మార్కెట్ వసూళ్లతో మాత్రమే అని సుకుమార్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్‌గా మారాయి. కాగా రీసెంట్‌గా సుకుమార్ .. గ్లోబల్ స్టార్, తన రంగస్థలం హీరో రామ్ చరణ్ చేసిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం యూఎస్ వెళ్లారు. అక్కడ ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తన కెరీర్ మొత్తం వన్ నేనొక్కడినే సినిమా ఫలితంతో తన ముగిసిపోవాల్సిన కెరీర్‌ని మళ్ళీ స్టార్ట్ అయ్యేలా చేసింది యూఎస్ ఆడియెన్స్ వల్లే అని సుకుమార్ చెప్పారు. ఆ సినిమా యూఎస్ మార్కెట్ నుంచి కానీ వసూళ్లు రాకపోయి ఉంటే డెఫినెట్ గా నా కెరీర్ ముగిసిపోయి ఉండేది అని సుకుమార్ ఎమోషనల్ అయ్యారు.

దీనితో తన సినిమా ప్లాప్ అయినప్పటికీ ఒక్క యూఎస్ మార్కెట్ లో వచ్చిన వసూళ్ల కారణంగానే మళ్ళీ సినిమాల్లో కొనసాగానని చెప్పవచ్చు. మరి అందుకే కాబోలు ఎప్పుడు చూసినా సుకుమార్ ఏదొక టెన్షన్ లోనే ఉన్నట్టు కనిపిస్తారు. ఇవి పక్కన పెడితే సుకుమార్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోనే మళ్ళీ ఓ భారీ సినిమా చేయబోతున్నారు.

More from Filmibeat

Read more about: sukumar pushpa 2 ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X