వీర సైనికుడిగా విజయ్ దేవరకొండ.. హైవోల్టేజ్ స్టోరీ సెట్ చేసుకున్న సుకుమార్
టాలీవుడ్ ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్టవుతున్నాయనే చెప్పాలి. 2020 ఎఫెక్ట్ కారణంగా కొంతమంది అగ్ర దర్శకులు మాత్రం లాక్ డౌన్ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. మరో నాలుగేళ్లకే సరిపడే కథలను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు సుకుమార్ ఎన్ని సిద్ధం చేసుకున్నారో తెలియదు గాని మొత్తానికి విజయ్ దేవరకొండ కోసం ఒక పవర్ఫుల్ కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.
Recommended Video

బాక్సాఫీస్ దుమ్ము ధులిపేలా..
2020లో చాలా సినిమాలు మిస్సయినప్పటికి ఆ గ్యాప్ ను పూరించేలా అద్భుతమైన కాంబినేషన్స్ సెట్టవుతున్నాయని చెప్పవచ్చు. రానున్న మూడేళ్ళలో బాక్సాఫీస్ దుమ్ము ధులిపేలా రికార్డులు నమోదవ్వడం పక్కా. ఎక్కువగా అందరి ఫోకస్ సుకుమార్ సినిమాలపైనే ఉంది. ప్రస్తుతం బన్నీతో పుష్ప అనే పాన్ ఇండియా ప్రాజెక్టును లైన్ లో పెట్టిన సుక్కు ఆ తరువాత విజయ్ దేరకొండతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

కాంబోపై భారీ అంచనాలు
ఇక ఆ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా ఎలా ఉంటుందనేది అభిమానుల్లో అంచనాల డోస్ ను పెంచుతోంది. ఎందుకంటే సుకుమార్ లాంటి మాస్టర్ మైండ్.. రౌడి బాయ్ ను ఎలా ప్రజెంట్ చేస్తుందనేది మేజర్ హైలెట్ పాయింట్.

సుకుమార్ మళ్ళీ అలాంటి టచ్ ఇవ్వలేదు.. అందుకే
ఇక సినిమా కథ బ్యాక్ గ్రౌండ్ ఇదేనంటూ ప్రస్తుతం ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది. సుకుమార్ రాసుకున్న కథలో ఒక దేశం కోసం పోరాడే వీర సైనికుడిగా విజయ్ దేవరకొండ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తాడట. నాన్నకు ప్రేమతో తరువాత సుకుమార్ మైండ్ గేమ్ కు సంబంధించిన సినిమాలు చేయలేదు. రంగస్థలంలో ఎక్కువగా మేకింగ్ స్టైల్ తోనే ఎట్రాక్ట్ చేశాడు గాని డీప్ గా ఆలోచించడానికి అవకాశం ఇవ్వలేదు.

పుష్ప తరువాత అసలైన సినిమా
ఇక పుష్ప సినిమాలో కూడా కమర్షియల్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయట. మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి పెద్దగా ప్రయోగాలు చేయకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ప్లాన్ చేశాడట. అల్లు అర్జున్ పాత్రతోనే కొన్ని ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఆ తరువాత ప్రాజెక్టులో మాత్రం తన ఇంటిలిజెన్స్ పవర్ ను మరో సారి భారీ స్థాయిలో ప్రజెంట్ చేస్తాడట సుక్కు.

ఇండో - పాక్ వార్.. బ్యాక్ గ్రౌండ్ లో లవ్ స్టొరీ
ఇండో - పాక్ వార్ నేపథ్యంలోనే ఆ సినిమా ఉంటుందని ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది. వార్ కు సంబంధించిన సన్నివేశాలతో పాటు ఒక యుద్ధ సైనికుడు వేసే అడుగులు ఎలాంటి మార్పులు తీసుకువస్తాయనే పాయింట్ ను హైలెట్ చేయనున్నారట. ఇక బ్యాక్ గ్రౌండ్ లో ఒక సైనికుడి ప్రేమను కూడా చాలా ఎమోషనల్ గా చూపిస్తారని తెలుస్తోంది. ఈ రూమర్స్ తో అంచనాలను పెంచుతున్న సుక్కు సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











