మహేష్ హ్యాండిస్తే... ఎన్టీఆర్‌తో చేతులు కలిపిన సుకుమార్... రంగస్థలం తర్వాత దారుణంగా!

రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు సుకుమార్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్‌లో ప్రాజెక్ట్‌కు తెర లేచింది. ఈ క్రేజీ కాంబినేషన్‌తో వచ్చే సినిమాను పట్టాలెక్కించేందుకు మైత్రీ మూవీస్ బ్యానర్ సిద్ధమైంది. అయితే సవ్యంగా సాగుతున్నదనే సమయంలో సుకుమార్‌తో సినిమా చేయడం లేదని మహేష్‌బాబు ట్వీట్ చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సుకుమార్‌ సినిమా చేయబోతున్నట్టు ఓ వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

మహేష్‌కు నచ్చని రెండు స్టోరీలు

మహేష్‌కు నచ్చని రెండు స్టోరీలు

రంగస్థలం తర్వాత మళ్లీ గ్రామీణ కథా నేపథ్యంతో తెలంగాణలో రజకార్ల బ్యాక్‌డ్రాప్‌‌తో సుకుమార్ సినిమా కథను సిద్ధం చేసి మహేష్ వినిపించారట. అయితే ఆ కథ నచ్చకపోవడంతో మళ్లీ గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో మరో కథను సిద్ధం చేశారట. ఈ రెండు కథల్లోనూ క్రియేటివ్ పరంగా విభేదాలు రావడంతో వీరి కాంబినేషన్‌లో సినిమా మొదలుకాకుండానే అటకెక్కింది.

అనిల్ రావిపూడితో మహేష్

అనిల్ రావిపూడితో మహేష్

సుకుమార్‌తో కథ సరిపడకపోవడంతో వెంటనే F2తో మంచి సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడితో మహేష్‌బాబుతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కామెడీ టచ్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.

సుకుమార్‌పై నాకు అత్యంత గౌరవం

సుకుమార్‌పై నాకు అత్యంత గౌరవం

సుకుమార్‌తో మహేష్ సినిమా చేయకపోవడానికి కారణాన్ని మహేష్‌బాబు ట్వీట్ ద్వారా తెలిపారు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సుకుమార్‌తో సినిమా చేయలేకపోతున్నాను. ఆయన ప్రారంభించే కొత్త ప్రాజెక్ట్‌ సక్సెస్ కావాలని కోరుకొంటున్నాను. అతని ప్రతిభపై నాకు అత్యంత గౌరవం ఉంది. 1 నేనొక్కడినే సినిమా నా కెరీర్‌లో ఓ కల్ట్ క్లాసిక్. ఆ సినిమాలో నటించేటప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను అని మహేష్ ట్వీట్ చేయడం తెలిసిందే.

ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో సుకుమార్

ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో సుకుమార్

మహేష్‌బాబు‌తో సినిమా వర్కవుట్ కాని క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్, ఎన్టీఆర్‌తో సుకుమార్ కథా చర్చలు జరుపుతున్నారట. గతంలో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్‌‌‌తో ఆర్య సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్, రాజమౌళితో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 మరో ఏడాది లోపు

మరో ఏడాది లోపు

రంగస్థలం సినిమా రిలీజై దాదాపు ఏడాది పూర్తి కావోస్తున్నది. ఏడాది కాలం తర్వాత కూడా సుకుమార్ సినిమా ప్రారంభించకలేకపోవడం చర్చనీయాంశమైంది. మరో సినిమా పట్టాలెక్కాలంటే కనీసం మూడు నెలలు పట్టే అవకాశం లేకపోలేదు. అంటే ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది వరకు సుకుమార్ సినిమా రాదనే విషయం స్పష్టంగా అర్ధమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X