సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి యాడ్.. అనసూయతో పాటు ట్విస్ట్ కూడా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

మెగాస్టార్ చిరంజీవి సుకుమార్ కలయికలో ఓ సినిమా రాబోతుంది అని మొదట్లో అనేక రకాల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తాము ఇద్దరం కలిసి ఒక యాడ్ ఫిల్మ్ కోసం వర్క్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో ఆ కథనాలు అన్నీ అబద్ధాలు అని తేలిపోయాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మెగాస్టార్ కు మొదటి సారి సుకుమార్ యాక్షన్ చెప్పి తనదైన శైలిలో ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. ఉగాది సందర్భంగా ఆ యాడ్ ఫిల్మ్ విడుదల చేయగా అందులో సుకుమార్ తన మార్కుకు తగ్గట్టుగా ట్విస్ట్ తో పాటు యాంకర్ అనసూయను కూడా హైలెట్ అయ్యేలా చేసాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సుకుమార్, మెగాస్టార్ కాంబో..

సుకుమార్, మెగాస్టార్ కాంబో..

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో మనసులో ఒక కోరిక అయితే ఉంటుంది. ఆయన తలుచుకుంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాడని కూడా చెప్పవచ్చు. ఇక మెగాస్టార్ మనసులో కూడా సుకుమార్ తో చేయాలని ఒక కోరిక అయితే ఉంది. అయితే ఇంకా సినిమా సెట్ అవ్వలేదు కానీ మొదట వీరి కలయికలో ఒక యాడ్ ఫిలిం అయితే అద్భుతంగా వచ్చింది.

ట్విస్ట్ తో పాటు అనసూయ

ట్విస్ట్ తో పాటు అనసూయ

దర్శకుడు సుకుమార్ మొత్తానికి మెగాస్టార్ చిరంజీవికి యాక్షన్ చెప్పి నటింపజేశాడు. పెద్దగా హడావుడి లేకుండా చాలా కూల్ గా బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ లాగా మెగాస్టార్ ను సుకుమార్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక ఈ యాడ్ ఫిలింలో సుకుమార్ మార్కు కు తగ్గట్టుగా ఒక ట్విస్ట్ ఉండడం ఉండడం అలాగే అనసూయ భరద్వాజ్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించడం విశేషం.

అనసూయ ఫోన్ కాల్

ముందుగా మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ తన భార్యకు మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని సిద్ధమవుతూ ఉంటాడు. ఇక వైఫ్ క్యారెక్టర్ లో వచ్చిన ఖుష్బూ ఈ రోజు ఏంటో గుర్తుందా మీకు అనగానే.. అందుకు మెగాస్టార్ ఇంటి అద్దె కదా కట్టేద్దాం అని అంటాడు. ఇక ఆ తరువాత సడన్ గా ఒక అమ్మాయి నుంచి ఫోన్ కాల్ రాగానే భార్య అనుమానిస్తుంది. తన ఫ్రెండ్ గౌతమ్ అని చిరు అబద్ధం కూడా చెబుతాడు.

అనసూయ, చిరు అలా..

అనసూయ, చిరు అలా..

వారిని ఫాలో అవుతూ ఉండగా అనసూయ మెగాస్టార్ ను కలుస్తుంది. లెట్ అయ్యింది ఏమిటి అనగానే నువ్వు ఫోన్ చేసినప్పుడు తను పక్కనే ఉంది తెలుసా అంటూ.. కానీ తెలియకుండా మ్యానేజ్ చేశానని అంటాడు. ఇక ఆ తరువాత అపార్ట్మెంట్ లోని ఒక రూమ్ లోకి వాళ్లిద్దరూ క్లోజ్ గా వెళ్లడం చూసిన ఖుష్బూ చాలా కోపంగా లోపలికి వెళుతుంది.

సుకుమార్ ట్విస్ట్

సుకుమార్ ట్విస్ట్

ఇక ఆమె లోపలికి వెళ్ళగానే అక్కడ ఊహించని వాతావరణం కనిపిస్తుంది. తన భార్య పుట్టినరోజు సందర్భంగా సొంతింటి కలను నిజం చేయాలని అనుకుంటున్నట్లు మెగాస్టార్ సంతకాలు పెడతారు. ఇక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ శుభగృహ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తారు. శుభగృహ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఈ యాడ్ ఫిల్మ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X