టాలీవుడ్‌కు మరో మెగా హీరో.. క్రేజీ ప్రాజెక్ట్‌తో తెరపైకి..

Recommended Video

Sukumar And Mythri Movie Makers To Launch Vaishnav Tej

టాలీవుడ్‌లోకి మరో మెగా హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్‌ నుంచి అరడజనుకు పైగా ఇండస్ట్రీలో తమదైన రితీలో దూసుకుపోతున్నారు. ఇక వైష్ణవ్ తేజ్‌ రాకతో మెగా యువ హీరోల సంఖ్య అదనంగా పెరిగింది.

 మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్

మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించే చిత్రంలో వైష్ణవ్ తేజ్ నటించనున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా ఇంతకు ముందు సుకుమార్‌ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం' చిత్రానికి రైట‌ర్‌గా కూడా పనిచేశారు.

దేవీశ్రీ ప్రసాద్ సంగీతంతో

దేవీశ్రీ ప్రసాద్ సంగీతంతో

టాలీవుడ్‌లో క్రేజీగా రూపొందించే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూర్చ‌నున్నారు. ఈ నూత‌న చిత్రానికి ప‌నిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నారు.

విస్తరిస్తున్న మెగా హీరోల రేంజ్

విస్తరిస్తున్న మెగా హీరోల రేంజ్

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రాంచరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌తోపాటు చిరంజీవి అల్లుడు కళ్యాణ్, నాగబాబు కూతురు నిహారిక ఇలా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది.

నిర్మాణ రంగంలోకి మెగా హీరోలు

నిర్మాణ రంగంలోకి మెగా హీరోలు

మెగా హీరోలుగా కేవలం నటనతోనే కాకుండా సినీ నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఖైదీ నంబర్ 150తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా మారారు. వ్యాపారం రంగంలో కూడా మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఇలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న వైష్ణవ్ తేజ్‌కు తొలిసినిమా అవకాశం మైత్రీమూవీస్, సుకుమార్ కాంబినేషన్‌లో లభించడం అదృష్టంగానే భావించాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X