Pushpa2 Glimpse అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. టెర్రిఫిక్ మోషన్ పోస్టర్ రిలీజ్ ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప చిత్రం భారీ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. తెలుగులో భారీ అంచనాలతో, హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టింది. పుష్ప ఇచ్చిన విజయంతో రెట్టింపు ఉత్సాహంతో పుష్ప2 సినిమా షూటింగ్ కొనసాగుతున్నది. పుష్ప సక్సెస్ తర్వాత అంచనాలు పెరిగిపోవడంతో అభిమానులు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దమవుతున్నారు.
అయితే ఇప్పటికే పుష్ప2 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అప్ డేట్ కోసం అల్లు అర్జున్ ఆర్మీ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులను సంతోషానికి గురిచేసేందుకు సుకుమార్ టీమ్ ఆసక్తికరమైన అంశంతో ముందుకొస్తున్నది.

పుష్ప2 సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను అల్లు అర్జున్ బర్త్ డే రోజున అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8వ తేదీన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ గ్లింప్స్‌తో మారోసారి తగ్గదేలే అనే రేంజ్‌ను మంచి బజ్ క్రియేట్ చేసే హుక్ డైలాగ్‌ను రెడీ చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ ఆర్మీకి పండగ లాంటి వాతావరణం నెలకొననున్నదని సినీ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











