‘పుష్ప’ కోసం సుకుమార్ నయా ప్లాన్: ఒకే దెబ్బకు మొత్తం అయిపోయేలా స్కెచ్

'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో 'పుష్ప' అనే సినిమాను ప్రకటించాడు. ఇది అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచే హీరో లేని సన్నివేశాలను కూడా చిత్రీకరించాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించి సుకుమార్ అదిరిపోయే ప్లాన్ చేశాడని తెలుస్తోంది.

'పుష్ప' మొదటి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తయినట్లు ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అలాగే, రెండో భాగం కోసం అనుకున్న సన్నివేశాలు కూడా చాలా వరకు చిత్రీకరించారట. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే అంటే జూలై నుంచి ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు, సుదీర్ఘంగా ఉండే ఈ షెడ్యూల్‌లోనే ఫస్ట్ పార్ట్‌ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట. ఈ విషయాన్ని ఇప్పటికే అల్లు అర్జున్‌కు, నిర్మాణ సంస్థకు కూడా చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు నుంచి కూడా సుకుమార్‌కు సపోర్ట్ దక్కినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే మొదటి భాగానికి గుమ్మడికాయ కొట్టబోతున్నారన్న మాట.

Sukumar planning a lengthy Schedule for Allu Arjuns Pushpa

ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప'లో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. దీని కోసం అతడు ఎన్నో రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా చేస్తుండగా.. అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇక, దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X