సరిలేరుపై నోరు విప్పని మాష్టారు.. అల వైకుంఠపురములో చిత్రాన్ని ఆకాశానికెత్తిన సుకుమార్

సుకుమార్ సినిమాలన్నా, ఆయన తెరకెక్కించే విధానమన్నా తెలుగు ప్రేక్షకులకు ఇష్టమే. తెలుగు సినిమా, ప్రేక్షకుడి స్థాయిని పెంచాలని చూసే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయనతో సినిమా అంటే ఓ ప్రయోగమే. అయితే అది అన్నిసార్లు వర్కౌట్ కాదు. దాదాపు అందరి హీరోలతో మంచిగానే ర్యాప్ మెయింటేన్ చేసే సుకుమార్‌కు, మహేష్ బాబుకు మధ్య గ్యాప్ వచ్చిందని అప్పట్లో టాక్ వచ్చింది. తాజాగా సుకుమార్ చేసిన పని వాటిని నిజం చేసేలానే ఉన్నాయి.

మహర్షి అనంతరం..

మహర్షి అనంతరం..

సుకుమార్ రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఊపులో ఉన్నాడు. మహేష్ బాబు మహర్షి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్ విషయమై మహేష్‌తో సుకుమార్ చర్చలు జరిపాడు. అనంతరం మహర్షి వేడుకలో ఓ డైరెక్టర్‌ను ఉద్దేశించి.. కొందరు అసలు ఎదురుచూడరని, వేరే వారిని చూసుకుంటారని సెటైర్ వేశాడు. ఇవి సుకుమార్‌ గురించే అన్నాడని గుసగుసలు వినిపించాయి.

ఇద్దరి ప్రాజెక్ట్స్ క్యాన్సెల్..

ఇద్దరి ప్రాజెక్ట్స్ క్యాన్సెల్..

మహేష్-సుకుమార్ కాంబినేషన్ కాస్తా పక్కకు జరిగి.. మహేష్ -అనిల్ రావిపూడి, సుకుమార్-అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌లు సెట్ అయ్యాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మహర్షి వేడుకల్లో తాను మాట్లాడిన మాటలు సుకుమార్‌ను ఉద్దేశించి కావని వివరణ ఇచ్చినా.. ఆ రూమర్లు ఆగలేదు. అయితే ఈ విషయం మరోసారి తెరమీదకు వచ్చింది.

అల వైకుంఠపురములో చిత్రంపై సుకుమార్..

అల వైకుంఠపురములో చిత్రంపై సుకుమార్..

అల వైకుంఠపురములో ఒక అందమైన సినిమా అని.. త్రివిక్రమ్ గారు తన సత్తాను మరోసారి చాటారని.. అల్లు అర్జున్ అద్భుతంగా నటించారని.. మ్యూజిక్.. చిత్రీకరణ బాగుందని మెచ్చుకున్నాడు. అల వైకుంఠపురములో టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. అంతే కాకుండా అల్లు అర్జున్‌ను హత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

 సరిలేరుపై మౌనం..

సరిలేరుపై మౌనం..

సంక్రాంతి బరిలోకి పోటాపోటీగా దిగిన అల, సరిలేరు చిత్రాలు భారీ విజయాలను నమోదు చేశాయి. రికార్డులు క్రియేట్ చేయడంలోనూ రెండూ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ లెక్కల మాష్టారు.. అల వైకుంఠపురములో చిత్రంపై స్పందించి.. సరిలేరుపై మౌనంగా ఉండటంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. వారిద్దరి మధ్య ఇంకా గ్యాప్ ఉందనే సంకేతాలను ఇచ్చేందుకు ఇలా చేశాడా? అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X