ఆడబిడ్డలకు సుకుమార్ సలహా.. తండ్రిని, అన్నను కూడా నమ్మొద్దు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ఘటన దిశా హత్యకేసు. షాద్‌నగర్‌లో మహిళా వెటర్నరీ డాక్టర్‌పై అత్యంత పాశవికంగా నాలుగు మానవ మృగాలు రెచ్చిపోయిన ఘటన కలకలం సృష్టించింది. అమ్మాయిల రక్షణను మరోసారి ప్రశ్నార్ధకంలో పడేసింది. ఈ ఘటనపై సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు.
తన ఇంట్లో కూడా అమ్మాయిలున్నారని.. అసలు ఇలాంటివి జరుగుతుంటే అమ్మాయిలు ఎలా బతుకుతారో అని భయం కూడా వేస్తుందని అన్నారు సుకుమార్. ప్రియాంకరెడ్డి హత్యాచారం గురించి వినగానే చాలా బాధేసింది. ఆ అమ్మాయిని అంత దారుణంగా హత్య చేయడం కలచివేసింది. బతకాలంటే భయం భయంగా ఉండే పరిస్థితి నెలకొంది. ఈ దుర్ఘటన చూసి అంతా ఆ అమ్మాయి 100కి డయల్ చేసి ఉండొచ్చు కదా అంటున్నారు.. అప్పుడు సాయం చేయడానికి వచ్చిన అబ్బాయిలను నమ్మిందేమో.. వాళ్లు సాయం చేస్తున్నపుడు కూడా పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లు ఏమనుకుంటారో అనుకుని ఉండొచ్చు కదా అన్నాడు సుకుమార్.

అంతేకాదు 'మీరు ఎవ్వరినీ నమ్మొద్దు.. సొంత తండ్రిని అన్నదమ్ములని కూడా నమ్మొద్దు.. అప్పుడే మీరు సేఫ్‌గా ఉండగలరు' అంటూ డైరెక్టర్ సుకుమార్ ఈ హత్యాచారాన్ని ఉద్దేశించి అన్నమాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేము మగాళ్లం కాదు మృగాలం. మమ్మల్ని నమ్మొద్దు అని సుకుమార్ చెప్పడంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు.
ఇటీవలే రంగస్థలం సినిమాతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సుకుమార్.. మరికొద్ది రోజుల్లో అల్లు అర్జున్‌తో మరో ప్రతిష్టాత్మక సినిమా రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











