అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌: అతడి ఆరోగ్యంతో పాటు ‘పుష్ప’పై అప్‌డేట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్.. చాలా వరకూ పూర్తైంది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన బ్యాలెన్స్ షూట్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వర్షాల కారణంగా సెట్స్ దెబ్బతిన్నాయి. ఆ తర్వాత సుకుమార్ జ్వరం కారణంగా చిత్రీకరణకు దూరంగా ఉన్నారు. దీంతో 'పుష్ప' షూట్ మొదలవలేదు. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ గుడ్ న్యూస్ తెలిసింది.

కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతోన్న డైరెక్టర్ సుకుమార్ తాజాగా కోలుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈరోజే 'పుష్ప' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను కూడా పున: ప్రారంభించారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సెట్‌లను నిర్మించారు. అందులోనే దాదాపు ఇరవై రోజుల పాటు ఓ షెడ్యూల్‌ను జరపబోతున్నారు. ఇందులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు నటీనటులపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి బన్నీ లేని సీన్స్‌ను షూట్ చేస్తారని.. మంగళవారమో, బుధవారమో అతడు జాయిన్ అవుతాడనే టాక్ ఫిలిం నగర్ ఏరియాలో వినిపిస్తోంది.

Sukumar Recovered from fever and Pushpa Shoot resumes today

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రను పోషిస్తున్నాడు. పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఇందులో కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ దీన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X