కోర్టులు కూడా వాళ్ల కింద బానిసలే సార్: ఆలోచింపజేసేలా సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ టీజర్

కెరీర్ ఆరంభం నుంచే వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఇలాంటి సమయంలో ఈ సారి వైవిధ్యమైన కథతో రావాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే వినూత్న చిత్రాల దర్శకుడు దేవ కట్టాతో జత కట్టాడు. వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రమే 'రిపబ్లిక్'. పొలిటికల్ బ్యాగ్ డ్రాప్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు.

'రిపబ్లిక్' రాజకీయ నేపథ్యంతో సాగే సినిమానే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు అనుగుణంగానే తాజాగా విడుదలైన టీజర్‌లో ఎన్నో అంశాలను చూపించారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం రాజకీయ నాయకులు సమాజంపై, వ్యవస్థలపై ఎటువంటి ప్రభావం చూపిస్తున్నారన్న దానిపై పెద్ద డైలాగ్స్ వినిపించారు.

'ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో.. అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ, కట్టకుండానే కూలిపోతోన్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులన్న విషయం తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం. ప్రజలే కాదు.. సివిల్ సర్వెంట్లు, కోర్టులే ఆ రూలర్స్ కింద బానిసలుగా బతుకుతున్నారు. వ్యవస్థ పునాధులే కరెప్ట్ అయినప్పుడు అందరూ కరెప్టే సార్' అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తున్నాయి.

Sukumar Released Sai Dharam Tejs Republic Movie Teaser

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రిపబ్లిక్' మూవీని భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొల్లేరు సరస్సు సమస్యలపై ఈ మూవీ రూపొందుతోందని అంటున్నారు. ఇది జూన్ 4న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X