Pushpa వెనక్కు 'తగ్గేదేలే', సునీల్ రోల్ సహా కీలక విషయాలు లీక్ చేసిన సుక్కూ.. ఆర్య 3 కూడా?
టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతుండగా ఆ ప్రచారాలు అన్నింటికీ ఈ రోజు ఆయన తాజాగా ఇంస్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చారు సుకుమార్. అలాగే సినిమాకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు కూడా వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటి సారిగా
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించడంతో ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఒక డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు నటించినని విధంగా ఈ సినిమాలో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

తగ్గేదేలే
ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కాబోతుందని ప్రకటించగా మళ్ళీ డేట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని 17నే సినిమా రిలీజ్ అవుతుందని వెల్లడించారు.

సునీల్ మెయిన్ విలన్
ఇక మొత్తం మీద ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఫహాద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ ఫహద్ ఫాసిల్ అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని మొదటి భాగం చివర్లో ఆయన వస్తాడు అని సునీలే సినిమాలో మెయిన్ విలన్ అని వెల్లడించారు సుకుమార్.

ఐటెం సాంగ్
ఇక ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని వెల్లడించిన ఆయన సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఒక నార్త్ అమ్మాయిని తీసుకొచ్చామని అన్నారు. ఈ సినిమా కోసం తెలుగులో ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాలోని ఐటెం సాంగ్ లో ఆడిపాడిన నోరా ఫతేహిని సంప్రదించగా ఆమె ఐదు నిమిషాల పాట కోసం ఆమె రూ.2 కోట్లు డిమాండ్ చేసింది అని అంటున్నారు. అయితే ఆమె చేసిందా మరొకరు చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

ఖుషీ ఖుషీగా బన్నీ ఫాన్స్
ఇక అల్లు అర్జున్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఆర్య, ఆర్య2 సినిమాలకు సీక్వెల్ గా ఆర్య 3 సినిమా చేయబోతున్నానని కూడా సుకుమార్ తన ఇంస్టాగ్రామ్ లైవ్ లో వెల్లడించారు. చేస్తున్నాను అని ప్రకటించారు కానీ దానికి సంబంధించిన ఎలాంటి వివరాలు మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద సుకుమార్ ఇంస్టాగ్రామ్ లైవ్ తో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రిలీజ్ డేట్ మారక పోవడంతో పాటు అన్ని విషయాలు మీద క్లారిటీ ఇవ్వడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు


Click it and Unblock the Notifications











