మణిరత్నం గారు కోపంగా పొమ్మన్నారు.. రజనీకాంత్ కుర్చీ వేసి కూర్చోపెట్టారు.. సుకుమార్ ఎమోషనల్

లెక్కల మాస్టర్ గా తన కెరీర్ ప్రారంభించిన సుకుమార్ తను కోరుకున్న విధంగా ని డైరెక్టర్ అయ్యారు. అయితే తాను డైరెక్టర్ అయిన తర్వాత మణిరత్నం విషయంలో ఒకసారి చేదు అనుభవం ఎదురైంది అని అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో మాత్రం ఒక అద్భుతమైన అనుభవం ఉందని, సుకుమార్ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే

ఆశక్తికర విషయాలు

ఆశక్తికర విషయాలు

దర్శకుడు సుకుమార్ ఇటీవలే పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి ఈ పరిస్థితుల్లో కూడా 300 కోట్ల రూపాయలు సాధించి తెలుగు సినిమా సత్తా చాటింది. ఇక పుష్ప సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ చేస్తున్న క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ కొన్ని ఆశక్తికర విషయాలు తన జీవితంలో జరిగిన వాటిని పంచుకున్నారు.

గీతాంజలి సినిమా చూసి ఫిదా

గీతాంజలి సినిమా చూసి ఫిదా

తాను యుక్త వయసులో ఉండగా గీతాంజలి అనే సినిమా చూసి ఫిదా అయిపోయాను అని ఆ సినిమా చూసి బయటకు వస్తుంటే తన ప్రియురాలిని విడిచి బయటకు వెళుతున్న ఫీలింగ్ వచ్చిందని అన్నారు. అంటే ఒక దర్శకుడు సినిమా తీస్తే జనాన్ని ఇంతలా ప్రభావితం చేయవచ్ఛా? అని అనిపించి అలా అయితే దర్శకుడి ని ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చారు. అయితే తనకు స్ఫూర్తిగా నిలిచిన ఆ మణిరత్నంతో తనకు చేదు అనుభవం ఒకటి ఎదురైంది సుకుమార్ వెల్లడించారు. తాను దర్శకుడిని కావడానికి ముందు మణిరత్నం గారిని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశా కానీ ఒక్కసారి కూడా కుదరలేదని అని చెప్పుకొచ్చారు.

చాలా బాధ పడ్డా

చాలా బాధ పడ్డా

కానీ ఆర్య సినిమాతో దర్శకుడిగా మారిన తర్వాత మణిరత్నం గారిని ఒకసారి ముంబై హోటల్ లో చూశానని అప్పుడు ఆయన నటి శోభనతో ఒక సీరియస్ డిస్కషన్ లో ఉన్నాను అని చెప్పుకొచ్చారు. వారి డిస్కషన్ అయిన తర్వాత కలుద్దాం అని చాలా సేపు ఎదురు చూసాను కానీ అది ఎంతకీ అవకపోవడం తో నేనే ఉండ బట్టలేక సార్ అంటూ దగ్గరకు వెళ్లి బోయాను. ఆయన కోపంగా చూస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్లుగా సైగ చేశారని అలా చేయడం చూసి చాలా బాధ పడ్డా అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక దర్శకుడు సీరియస్ గా డిస్కషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో తనకు తెలుసని, తాను పెద్ద దర్శకుడిగా మారిన తర్వాత ఆ విషయం తనకు అర్థం అయిందని ఆయన చెప్పుకొచ్చారు.

రజినీకాంత్ తో

రజినీకాంత్ తో

ఇక ఎప్పటికైనా మణిరత్నంనీ కలవాలని, అది తన కోరిక అని ఆయన వెల్లడించారు. ఇక అదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో తనకి ఉన్న ఒక మంచి అనుభవం గురించి సుకుమార్ పంచుకున్నారు. రోబో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పటికే ఆర్య సినిమా పూర్తి అయిందని, షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి నేను వెళ్తే అప్పటికే ఆర్య సినిమా చూసిన రజిని సార్ నన్ను పలకరించడానికి నా దగ్గరికి రావడంతో వణుకుతూ చేతులు కట్టుకుని సార్ సార్ అని అంటూ మాట్లాడడం మొదలు పెట్టానని అన్నారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఆర్య లో హీరోయిన్ హెయిర్ పిన్ పడిపోయే సీన్ గురించి మాట్లాడరని, అలాగే ఆర్యలో ఒక ఫైట్ గురించి కూడా ఆయన మాట్లాడారు అని చెప్పుకొచ్చారు.

Recommended Video

Pushpa Movie Pre Release Business, Premiers Details
జీవితం మొత్తం మీద ది బెస్ట్

జీవితం మొత్తం మీద ది బెస్ట్


ఈ క్రమంలో ఆయన షాట్ రెడీ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్ పిలవడంతో ఆయన లేచి వెళుతున్నారని ఆ సమయంలో నిలబడి ఉంటే మళ్ళీ వచ్చి కూర్చోమని ఆయన చెప్పారు అని చెప్పుకొచ్చారు. నేను ఎంతకీ కూర్చోకపోవడం తో ఒక కుర్చీ తీసుకువచ్చి వేసి వారే కూర్చోబెట్టారని అప్పుడు నేను కూర్చోవాల్సి వచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. అలా ఒక రజనీకాంత్ లాంటి వ్యక్తి ఒక కుర్చీ తీసుకువచ్చి ఆయనే స్వయంగా వేసి కూర్చోబెట్టిన విషయం నా లైఫ్ మొత్తం మీద ఒక గోల్డెన్ మూమెంట్ అని సుకుమార్ చెప్పుకొచ్చారు. అలా మొత్తం మీద తనకు ఇష్టమైన మణి రత్నంతో చేదు అనుభవం ఏర్పడితే తనకు ఇష్టమైన రజినీకాంత్ తో మాత్రం ఒక మరచిపోలేని అనుభవం ఏర్పడిందని ఇప్పటికి అది తన జీవితం మొత్తం మీద ది బెస్ట్ అని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికీ పుష్ప మొదటి భాగం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోగా దీనికి సంబంధించిన రెండో భాగం కూడా ఇదే ఏడాదిలో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి భాగం షూటింగ్ చేస్తున్నప్పుడే కొంత రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక మిగిలిన షూటింగ్ కూడా పూర్తిచేసి 2022 చివరి లోపు విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X