సినిమాలు వదిలేస్తా .. సుకుమార్ సంచలన స్టేట్మెంట్ వెనుక కారణం ఏంటి?

ఇప్పుడు ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్న టాప్ మోస్ట్ దర్శకుల జాబితా తీస్తే ఈ లిస్ట్‌లో మన తెలుగు దర్శకులే చాలా మంది ఉంటారని చెప్పాలి. ఒకొక్కరిగా ఈ లిస్ట్‌లోకి వెళ్తే డెఫినెట్ గా ముందు మాత్రం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరే ఉంటుంది. ఆయన తర్వాతే ఏ డైరెక్టర్ అయినా.

అయితే లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో యాడ్ అయ్యిన దర్శకుల్లో సెన్సేషనల్ దర్శకుడు సుకుమార్ కూడా అని చెప్పాలి. తాను తెరకెక్కించిన భారీ చిత్రం పుష్ప 2 తో ఏకంగా రాజమౌళి పెట్టిన అన్ని రికార్డ్స్ కి ఎసరు పెట్టాడు సుకుమార్. మరి సుకుమార్ విషయంలోనే రాజమౌళి ఒకప్పుడు ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సుకుమార్, త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మాస్ కమర్షియల్ సినిమాలు స్టార్ట్ చేస్తే మనం సర్దుకోవాల్సిందే అనుకున్నాను అని తెలిపారు.

sukumar stopping movies he made shocking comments in game changer

ఆయన చెప్పినట్లు గానే సుకుమార్ చేసిన మాస్ చిత్రం పుష్ప 2 అన్ని రికార్డులు కొల్లగొట్టింది. అయితే ఇపుడు తెలుగులో ఉన్న టాప్ మోస్ట్ దర్శకులు అందరిలో ఒక్క సుకుమార్ మాత్రం ఇప్పటికీ తన మార్క్ ని కొనసాగిస్తూ వచ్చారు. టాలీవుడ్ లో కొంచెం ఇంటెలిజెంట్ తరహా సినిమాలు చేయడంలోనూ ఆయన ముద్ర బలంగా వేసుకున్నారు. కాగా సుకుమార్ తన చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి ఒక క్రేజీ ట్రీట్‌ని అందించారు.

మరి ఇలాంటి దర్శకుని నుంచి చాలా మంది డెఫినెట్‌గా మరిన్ని సినిమాలు ఆశిస్తారు. కానీ సుకుమార్ మాత్రం సినిమాలు ఆపేస్తాను అంటే రియాక్షన్ డెఫినెట్ గా ఆడియెన్స్ నుంచి తేడాగా వస్తుంది. నిజంగానే సుకుమార్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారా అంటే ఔనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. తాను సినిమాలు ఆపేస్తాను అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కనే ఉండి మరీ అనౌన్స్ చేశారు.

sukumar stopping movies he made shocking comments in game changer

రీసెంట్ గా చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈవెంట్ యూఎస్ లో జరిగింది దీనికి గెస్ట్ గా సుకుమార్ వెళ్ళారు. ఈ సందర్భంగా యాంకర్ సుమతో వచ్చిన టాపిక్‌లో ఆమె అడిగిన ప్రశ్నకి ధోప్ అనే పదంతో ఒకటి వదిలెయ్యాలి అని చెబుతుంది. దీంతో సుకుమార్ తాను సినిమాలు వదిలేస్తాను అని చెప్పడం పక్కనే ఉన్న రామ్ చరణ్ కి కూడా షాకిచ్చింది. దీనితో వెంటనే మైక్ తీసుకొని అలా ఏం చెయ్యొద్దు అంటూ సుకుమార్‌కి అక్కడే చెప్పేసారు.

అయితే ఈ మధ్య కాలంలో సుకుమార్ తన సినిమాలు రిలీజ్ కి వస్తున్న సమయంలో కూడా ఏదో టెన్షన్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. మరి అందుకు కారణాలు ఏంటి అనేది తనకే తెలియాలి . కానీ ఇలా సడెన్ గా సినిమాలే వదిలేస్తాను అని చెప్పడం మాత్రం ప్రతీ ఒక్కరికీ షాకింగ్ గా మారింది. పుష్ప 2 తర్వాత సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోనే ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Read more about: sukumar shankar pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X