బాక్సాఫీస్ విజయాలతో దూసుకుపోతున్న సుకుమార్ శిష్యులు.. నెక్స్ట్ అందరి ఫోకస్ అతనిపైనే..

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఎలాంటి సినిమా తీసిన కూడా అందులో ఏదో ఒక పాయింట్ కొత్తగా ఉండేలా చూసుకుంటాడు. అయితే ఈ దర్శకుడు లెక్కల మాస్టారుగా ఎంతో మందికి విద్యను అందించాడు. అయితే ఆ తర్వాత ఎంతో ఇష్టంగా అతను సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక సినిమా ప్రపంచంలో కూడా అతను దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన అసిస్టెంట్ దర్శకులకు చాలా హెల్ప్ అవుతున్నాడు.

వారికి కెరీర్ ను మెరుగుపరుచుకునే విధంగా వారికి అండగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో అతని ద్వారా వచ్చిన వారు మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. సుకుమార్ దగ్గర జగడం మూవీ సినిమా నుంచి సహాయక దర్శకుడిగా పని చేస్తూ వస్తున్న వారిలో కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ కూడా ఉన్నాడు. అతని మొదటి సినిమా కరెంట్ ప్లాప్ అయినప్పటికీ కూడా మళ్ళీ రెండో సినిమాతో సుకుమార్ కథను అందించి అతనికే దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చాడు. కుమారి 21ఎఫ్ సినిమా బిగ్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Sukumar student Srikanth big hit with dasara and next focus on karthik

అలాగే ఆ తరువాత వన్ నేనొక్కడినే సినిమా దగ్గరనుంచి సుకుమార్ దగ్గర సహాయక దర్శకుడిగా వర్క్ చేసుకుంటూ వచ్చిన బుచ్చిబాబు కూడా సుకుమార్ సపోర్ట్ తోనే ఉప్పెన సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. అది టాలీవుడ్లో ఏకంగా 100 కోట్ల బిజినెస్ అయితే చేసింది. ఇక ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలా ఏకంగా ఫ్యాన్ ఇండియా సినిమాతో వచ్చాడు. శ్రీకాంత్ సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో సినిమా నుంచి సహాయక దర్శకుడిగా వర్క్ చేసుకుంటూ వచ్చాడు.

ఇక అతను ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 'దసరా' అనే సినిమాను తెరపై తీసుకువచ్చాడు. నేడు విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అయితే అందుకుంది. ఇక మొదటి రోజే 17 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకున్న దసరా సినిమా రేపటి కలెక్షన్స్ ని బట్టి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అర్థమవుతుంది.

ఇక రాబోయే రోజుల్లో సుకుమార్ నుంచి మరికొంతమంది దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అందులో కార్తీక్ దండు కూడా ఉన్నాడు. అతను ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో విరుపాక్ష అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుకుమార్ సొంతంగా కథను అంధించి ఈ సినిమాకు సహా నిర్మాతగా కూడా ఉన్నాడు. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X