బన్నీ సినిమాలో KGF విలన్.. సెట్టవ్వకుంటే సీనియర్ హీరో?
అల్లు అర్జున్ కెరీర్ లొనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మరో చిత్రం 'పుష్ప'. ఆర్య సిరీస్ తో స్పెషల్ క్రేజ్ అందుకున్న సుకుమార్ బన్నీ మూడవసారి కూడా మరొక లవ్ స్టోరీతో వస్తారనుకునే ఊహాగానాలకు చెక్ పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గత కొన్ని వారాల క్రితమే ఈ సినిమాను మొదలుపెట్టారు.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా బ్రేకులు పడ్డ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా ఇదే సమయంలో పూర్తి చేసుకోవాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇకపోతే సినిమాకు సంబంధించిన విలన్ పాత్ర కోసం సుకుమార్ హై లెవెల్లో ఆలోచిస్తున్నాడు. పుష్ప పాన్ ఇండియా సినిమా కావడంతో నేషనల్ లెవెల్లో మార్కెట్ జరగాలి కాబట్టి అందరికి తెలిసిన స్టార్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఆ లిస్ట్ లో పెద్ద పెద్ద యాక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. KGFలో మెయిన్ విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందట. ఆయన కుదరకపోతే ఒకప్పటి యాక్షన్ హీరో సునీల్ శెట్టిని అయినా సినిమాలో విలన్ గా చూపించాలని అనుకుంటున్నారట. తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో రూపొందుతున్న 'పుష్ప'పై ఇప్పటికే ఆడియెన్స్ లో అంచనాలు అకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారు అంటే ఇంకా ఏ రేంజ్ లో అంచనాల డోస్ పెరుగుతుంది అనేది ఎవరికి అంతు పట్టడం లేదు. మరి సుకుమార్ ఎలాంటి కిక్కిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











