మెగా హీరోకు సుకుమార్ సహాయం: ఆయన చేతుల మీదుగా ‘రిపబ్లిక్’ టీజర్

ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. నిన్న మొన్నటి వరకూ పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డ ఈ యంగ్ హీరో.. 'చిత్రలహరి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత 'ప్రతి రోజూ పండగే'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, ఇటీవల వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్'తో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఈ జోష్‌లోనే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

వినూత్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న దర్శకుడు దేవ కట్టా. అతడి డైరెక్షన్‌లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న చిత్రమే 'రిపబ్లిక్'. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ రెండు రోజుల క్రితమే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మరో అప్‌డేట్ ఇచ్చారు. ఇక, ఈ టీజర్‌ను లాంచ్ చేయడం కోసం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో ఓ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించబోతున్నారు. దీనికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా వస్తున్నారు.

Sukumar to Launch Sai Dharam Tejs Republic Movie Teaser

ఆయన చేతుల మీదుగానే ఉదయం 11.30 గంటలకు ఇది విడుదల కాబోతుంది. ఈ మేరకు ఆయనకు స్వాగతం చెబుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను వదలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రిపబ్లిక్' మూవీని భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొల్లేరు సరస్సు సమస్యలపై ఈ మూవీ రూపొందుతోందని అంటున్నారు. ఇది జూన్ 4న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X