ఎన్టీఆర్ సినిమాకు నిర్మాతగా సుకుమార్: ఆ ప్రాజెక్టులో భాగమైన క్రియేటివ్ డైరెక్టర్
ఎన్టీఆర్ సినిమాకు నిర్మాతగా సుకుమార్: ఆ ప్రాజెక్టులో భాగమైన క్రియేటివ్ డైరెక్టర్
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు హిట్లను అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఉత్సాహంలోనే ప్రస్తుతం అతడు దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRRలో నటిస్తున్నాడు. ఎన్నో అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా చేస్తున్నాడు. ఇందులో తారక్.. తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రను పోషిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడీ నందమూరి హీరో. ఇందులో భాగంగానే 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సనతో సినిమా చేయనున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర చాలా కాలం పాటు అసిస్టెంట్‌గా పని చేసి.. ఈ మధ్యనే 'ఉప్పెన' అనే సినిమా దర్శకుడిగా మారాడు బుచ్చిబాబు సన. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న అతడు.. రెండో ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు. కానీ, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అతడికి ఛాన్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చేది నిజమేనని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ నిర్మించబోతున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఇక, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మధ్య వయసు కలిగిన ఓ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు ఈ స్క్రిప్టు వర్కులోనే బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











