బాలీవుడ్‌కు సుకుమార్.. ఆ ప్లాన్ నిజమేనా!
టాలీవుడ్ స్టార్ దర్శకులలో సుకుమార్ ఒకరు. తన చిత్రాలు భిన్నంగా ఉండాలని సుకుమార్ ఎప్పుడూ భావిస్తారు. సుకుమార్ ప్రేమ కథలు చిత్రీకరించినా, యాక్షన్ చిత్రాలు తెరకెక్కించినా, గ్రామీణ నేపథ్యంలో సినిమాలు చేసినా అవి వైవిధ్యంగా ఉంటాయి. సుకుమార్ చిత్రాలు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లా ఉండవు. కానీ అందులో కమర్షియల్ అంశాలు తప్పకుండా ఉంటాయి.
గత ఏడాది సుకుమార్ రంగస్థలం చిత్రంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. రంగస్థలం తర్వాత సుకుమార్, మహేష్ కాంబోలో చిత్రానికి ప్రకటన వచ్చింది. కానీ ఈ చిత్రం ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లేలా లేదు. సుకుమార్ తాజాగా బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏమేరకు వస్త్వవం ఉందో తేలాలి. జరుగుతున్న ప్రచారం ప్రకారం సుకుమార్ తన చిత్రాలన్నింటిలో మంచి సన్నివేశాలతో ఓ షో రీల్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ ప్రముఖ ఎడిటర్ దీనికోసం సుకుమార్ కు సహకరిస్తున్నారట. ఈ షో రీల్ ని సుకుమార్ త్వరలో బాలీవుడ్ లోని షారుఖ్, సల్మాన్ లాంటి హీరోలకు చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా సుకుమార్ స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











