నేనెప్పుడూ సగాన్నే..నువ్వు వచ్చాక రాక ముందూ.. సుక్కూ భార్య ఫుల్ ఖుష్!

ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి కరోనా కారణంగా జరగడం లేదు. కానీ సుకుమార్ మాత్రం రెండో భాగం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ రోజు సుకుమార్ పెళ్లి రోజు కావడంతో ఆయన భార్యకు తన స్టైల్ లో విషెస్ చెప్పగా భారీ కూడా ఆయనకు తన స్టైల్లో విషెస్ చెప్పారు.

ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సుకుమార్ భార్య, ఇలా అద్భుతమైన వాక్యాలతో నా మీద ఉన్న ప్రేమని చెప్పడానికి నీకు దేవుడు సూపర్ పవర్ ఇచ్చారు అందుకే నేను ఎప్పుడూ స్పెషల్ గా ఫీల్ అవుతాను అని ఆమె చెప్పుకొచ్చారు. మీరు నా మీద ఉన్న ప్రేమను చూపించడానికి వాడే వాక్యాలు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తునే ఉంటాయి. ఆ వాక్యాలు రాసినందుకు గాను మీకు నా ప్రేమ, అంటూ ఆమె రాసుకొచ్చారు.

Sukumar wedding day wishes to his wife in his style

ఇంతకీ సుకుమార్ ఏమి రాశారంటే 'నేనెప్పుడూ సగాన్నే, నువ్వు రాకముందు పూర్తికాని సగాన్ని వచ్చాక పూర్తయిన సగాన్ని నేను పూర్తి కావడం అంటే నీ సగం అవ్వడమే కదా, నా సగానికి పూర్తి ప్రేమతో వివాహ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆయన రాసుకొచ్చాడు. ఇక సుకుమార్ భార్య తబిత త్వరలోనే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వ్యవహారాలన్నీ చూసుకో బోతున్నారని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ స్నేహితుడు, మేనేజర్ అయిన ప్రసాద్ కన్నుమూయడంతో ఇప్పుడు సుకుమార్ చాలా ఒత్తిడికి గురై వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వేరే ఎవరికీ బాధ్యతలు అప్పగించాలని అర్థం కాక ఆయన పడుతున్న టెన్షన్ చూసి ఆయన భార్య ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X