For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భార్యకు ప్రేమతో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సుకుమార్.. కూతురు, కొడుకుతో క్యూట్ ఫొటోస్

  |

  ఆర్య సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా విభిన్నంగా తెరకెక్కిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సన్నివేశంలో కూడా ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకునే సుకుమార్ పర్సనల్ లైఫ్ లో చాలా ప్రైవసీని ఇష్టపడతారు. ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళతారు.

  ఇక సినిమా తప్పితే మరొక విషయాన్ని పట్టించుకోని సుకుమార్ ఇటీవల కాలంలో మాత్రం కాస్త సోషల్ మీడియాలో కూడా హడావిడిగా కనిపిస్తున్నారు. అది కూడా కేవలం తన భార్య వచ్చిన తర్వాతే సుకుమార్ లో మార్పులు చాలానే వచ్చాయని తెలుస్తోంది. ఇక ఇటీవల తన భార్య కోసం సుకుమార్ ఒక సెలబ్రేషన్ కూడా చేశాడు.

  Bigg Boss Telugu 5 Promo: టాస్క్ ఆడుతూ కింద పడిపోయిన కంటెస్టెంట్.. నలుగురి మధ్య భీకర యుద్ధం

  రాజమౌళి మిత్రుడిగా..

  రాజమౌళి మిత్రుడిగా..

  దర్శకుడు సుకుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కేవలం ప్రేమకథతోనే కాకుండా రంగస్థలం లాంటి వైవిధ్యమైన సినిమాలు కూడా తెరకెక్కించే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ హోదా ను అందుకున్నారు. సుకుమార్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. రాజమౌళి కూడా ఆర్య సినిమా చూడగానే సుకుమార్ కు పెద్ద ఫ్యాన్ లా మారిపోయాడు. ఆర్య తర్వాత రాజమౌళి సుకుమార్ ప్రతి సినిమాను కూడా ఫాలో అవుతూ వస్తున్నాడు. వన్ ఒక్కడినే ఫ్లాప్ అయినా కూడా దర్శకుడు రాజమౌళి ఆ సినిమాను ఎంతగానో ఇష్టపడతారు.

  పుష్ప సినిమాతో బిజీబిజీగా..

  పుష్ప సినిమాతో బిజీబిజీగా..

  సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తో మూడవసారి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా సుకుమార్ కెరీర్లో కూడా ఇదే అత్యధిక భారీ బడ్జెట్ మూవీ. అంతే కాకుండా వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాతో ఎలాగైనా మరో స్థాయికి వెళ్లాలని ఇద్దరు చాలా కసిగా కష్టపడుతున్నారు.

  భార్య పుట్టినరోజు వేడుక..

  భార్య పుట్టినరోజు వేడుక..

  ఇక పుష్ప సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ కూడా సుకుమార్ తన కుటుంబానికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. సుకుమార్ భార్య తబితా పుట్టినరోజు వేడుకను ఇటీవల గ్రాండ్ గా నిర్వహించాడు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో సుకుమార్ భార్య పుట్టినరోజు వేడుకలు హ్యాపీ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

  ఆర్య సినిమాతో.. ప్రేమ వివాహం

  ఆర్య సినిమాతో.. ప్రేమ వివాహం

  సుకుమార్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2004లో తన మొదటి సినిమా ఆర్య విడుదలైనప్పుడు తాబిత పరిచయం అయ్యిందట. ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ వద్ద ఆర్య సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించినప్పుడు అక్కడికి తబితా కూడా వచ్చిందట. అక్కడ అందుకోకుండా పరిచయం అవ్వడంతో ఐదేళ్ల వరకు వారి బంధం కొనసాగింది. ఇక ఫైనల్ గా 2009లో సుకుమార్ పెళ్లి చేసుకున్నాడు.

  తబిత కుటుంబ సభ్యులు సుకుమార్ తో పెళ్లికి ఒప్పుకోలేదు. సినిమా ఇండస్ట్రీ వ్యక్తికి అబ్బాయిని ఇవ్వకూడదు అని వారి తల్లిదండ్రులు అనుకున్నారట. ఇక వాళ్ళను కాదని తబిత సుకుమార్ ని పెళ్లి చేసుకున్నారు. సుకుమారి తల్లిదండ్రులు, సోదరిమణులకు సమక్షంలో వీరి వివాహం జరిగింది.

  ఆ సినిమాలో సుకుమార్ కూతురు

  ఆ సినిమాలో సుకుమార్ కూతురు

  సుకుమార్ కు ఒక కూతురు కొడుకు ఉన్నారు. ఇక ఆయన కూతురు సుకృతి వేణి వెండితెరపై ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. 100% లవ్ సినిమాలో తమన్నా ఎంట్రీ ఇచ్చినప్పుడు సుకృతి వేణిని ఎత్తుకొని సీన్ లోకి వస్తుంది. ఆ చిన్న పాప ఇప్పుడు సుకుమార్ గుండె వరకు వచ్చేసింది. కూతురు అంటే సుకుమార్ కు పంచ ప్రాణాలు. ఇక ఆమెతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడానికి ఈ స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపిస్తాడాట.

  English summary
  Sukumar wife Thabitha Bandreddi birthday celebration photos viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X