18 Pages Glimpse: ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. సుకుమార్ రాసిన మరో ప్రేమ కావ్యం!

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ లవ్ స్టోరీలను ఎంత బాగా ప్రజెంట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడు పాన్ ఇండియాలో యాక్షన్ సినిమాలు అంటున్నాడు గాని ఒకప్పుడు ఆర్య, ఆర్య 2, 100% లవ్ ఇలా విభిన్నమైన లవ్ స్టోరీలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇక ప్రస్తుతం ఆయన పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడంతో అందమైన చిన్న కథలను తెరపైకి తీసుకు రాలేకపోతున్నాడు. అందుకే ఆ బాధ్యతను తన శిష్యులకు అప్పగించాడు. సొంతంగా కథలు రాసుకుంటున్న సుకుమార్ తన స్టూడెంట్స్ కి అప్పగించి వాటిని వెండితెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కాకుండా ప్రత్యేకంగా సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ను కూడా సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే సుకుమార్ రైటింగ్స్ నుంచి త్వరలోనే మరో అద్భుతమైన ప్రేమ కావ్యం రాబోతోంది. నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజెస్ అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్స్ తో ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్ తో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశారు. ఈ టీజర్ లో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ చాలా కూల్ గా కనిపిస్తూ ఉన్నారు డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

'నాకు తెలియని అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేది.. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామా అని అంటే ఆన్సర్ ఉండకూడదు..' అని నిఖిల్ చెప్పిన డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే సుకుమార్ మార్క్ కు తగ్గట్టుగా సినిమాలో అందమైన లవ్ స్టోరీ హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో డైరీ చుట్టూ నడిచే ఒక క్యూట్ లవ్ స్టోరీ అని అర్థం అవుతోంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హోమ్లీ అమ్మాయిగా చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉండగా హీరో నిఖిల్ మాత్రం కూల్ గా హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

 Sukumar writings 18 Pages movie first Glimpse released

ఈ సినిమాను కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య కుమార్ ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. సరైన రిలీజ్ డేట్ దొరకకపోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమోషన్స్ కూడా చేయలేకపోయారు. ఇక ఇప్పుడు అందమైన ఒక టీజర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ రెగ్యులర్ గా ప్రమోషన్స్ కూడా చేయాలని అనుకుంటోంది. అంతేకాకుండా త్వరలోనే పాటలను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక GA2 ప్రొడక్షన్స్ తో కలిపి సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇక సినిమాను ఫైనల్ గా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గా చెబుతున్నారు. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X