twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్కడ వెతికినా కనిపించడం లేదట.. సుమ సినిమాకు అలాంటి దారుణ పరిస్థితా?

    |

    యాంకర్ సుమ ఇప్పుడంటే అందరికీ ఓ ఇమేజ్ ఏర్పడింది. సుమను యాంకర్‌గానే అందరూ ఊహించుకుంటారు. ఆమెలో ఓ నటి ఉందన్న సంగతి కొందరికే తెలుసు. అందుకే ఆమెతో జయమ్మ పంచాయితీ అనే చిత్రాన్ని తీశారు. ఇందులో సుమ నటనకు వంక పెట్టలేం. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఇదే అని కాదు సుమ లీడ్ రోల్ చేసిన ఏ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కెరీర్ స్టార్టింగ్‌లో సుమ కొన్ని సినిమాల్లో నటించింది. హీరోగానూ చేసింది. సైడ్ ఆర్టిస్ట్‌గానూ నటించింది.

    బుల్లితెరపై ఫోకస్..

    బుల్లితెరపై ఫోకస్..

    పెళ్లి తరువాత సుమ తన ఫోకస్ అంతా కూడా బుల్లితెరపైనే పెట్టేసింది.అడపా దడపా చిత్రాలు వచ్చినా కూడా అంతగా చేయలేదు. కానీ అప్పుడప్పుడు అలా అలా మెరిసేది. వర్షం, ఢీ సినిమాల్లో సుమ చిన్న చిన్న పాత్రలు పోషించింది. అవేమీ ఆమెకు అంతగా గుర్తింపును ఇవ్వలేదు.

    షోలు, ఈవెంట్లతో బిజీగా..

    షోలు, ఈవెంట్లతో బిజీగా..

    ప్రస్తుతం సుమ అయితే బుల్లితెరపై పలు వినోదాత్మకమైన షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతోనే బిజీగా ఉంటోంది. క్షణం తీరిక లేకుండా ఉండే సుమ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈవెంట్ నాలుగు గంటలు ఉంటే.. సుమ మాత్రం కేవలం రెండు గంటలు వచ్చి, ఉండి పోతుంది. చివర్లో హీరో మాట్లాడటం ప్రారంభిస్తే సుమ.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    Recommended Video

    వాడంత వెధవ ఉండడు, సంచలనంగా మారిన నాగబాబు ట్వీట్ *Politics | Telugu OneIndia
    మాచర్ల ఈవెంట్..

    మాచర్ల ఈవెంట్..

    ఆదివారం నాడు సుమ మాచర్ల ఈవెంట్‌లో తన స్టైల్లో సందడి చేసింది. అక్కడికి రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ కూడా వచ్చాడు. అయితే ఈ ఇద్దరికి పాత రిలేషన్ ఒకటి ఉంది. ఈ ఇద్దరూ కూడా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. దీనిపై వారిద్దరూ సెటైర్లు వేసుకున్నారు.

    ఎక్కడా కనిపించడం లేదట..

    ఎక్కడా కనిపించడం లేదట..

    చాలా ఏళ్ల తరువాత ఇలా కనిపించామని, ఒక ఫోటో అడుగుతున్నారని సుమ అంటుంది. దీంతో పక్కనే వక్కంతం వంశీ కౌంటర్ వేస్తాడు. ఎలాగూ సినిమా ఎక్కడుందో ఎవ్వరికీ తెలియడం లేదు. దొరకడం లేదు. ఈ ఫోటోలను అయినా వాడుకుంటారులే అని మీడియాకు స్టేజ్ మీద సుమతో కలిసి వక్కంతం వంశీ పోజులిచ్చాడు. మొత్తానికి ఈ ఇద్దరూ కూడా తమ సినిమా దారుణంగా సెటైర్లు వేసుకున్నారు.

    English summary
    Macherla Niyojakavargam Event held at hhyderabad. in this event, Sumacomments about vakkantham Vamshi's Movie Kalyana Prapthirasthu Topic At Macherla Niyojakavargam Event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X