నా పెళ్లాంతో విడాకులు ఇప్పించేయ్ అక్కా... యాంకర్ సుమ ముందు నటుడు ఆవేదన

స్టార్ యాంకర్‌గా తెలుగు నాట వెలుగొందుతున్నారు సుమ కనకాల. సినిమా ఈవెంట్స్, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు, బుల్లితెరతో పాటు తన ఫ్యామిలీని చూసుకుంటూనే లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు సుమ కనకాల. ఎంతోమంది యాంకర్లు వచ్చారు వెళ్లారు.. కానీ సుమ మాత్రం ఎవర్‌గ్రీన్. దాదాపు 25 ఏళ్లుగా సుమ బుల్లితెర, వెండితెరపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. అలాంటి సుమ ముందుకు ఓ పంచాయతీ వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

సుమ కనకాలకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యాతో ఆమెతో డిఫరెంట్‌గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సీనియర్ హీరోలే కాదు.. జూనియర్ హీరోలు కూడా తమ సినిమాలకు ప్రమోషన్స్ చేసిపెట్టమని సుమ ఇంటి ముందు క్యూకడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో పాటు తన ఇంట్లోనే ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు సుమ. తాజాగా పురుష టీమ్‌తో సుమ కనకాల సందడి చేశారు.

Suma Kanakala Shocked by Couples Divorce Issues During Purushaha Movie Promotions

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం పురుష: వీరూ ఉలవల దర్శకత్వం వహిస్తుండగా.. సరస్వతి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, రాజ్ కసిరెడ్డి, వైష్ణవి కొక్కుర, విషిక, హషినీ సుధీర్, శ్రీ సంధ్య, గాబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మీ సాయి, వీటీవీ గణేష్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకత్వం వహించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా, కోటీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రస్తుత కాలంలో పెళ్లయిన జంటల మధ్య ఉండే గొడవలు, గిల్లికజ్జాలు, చిన్న చిన్న కారణాలకే విడాకులకు దారి తీస్తున్న పరిస్ధితులు, సమాజంలో చోటు చేసుకుంటున్న వివిధ సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని పురుష: సినిమాను తెరకెక్కించారు వీరూ ఉలవల. సమ్మర్ కానుకగా మే 22న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు, పోస్టర్లు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సుమ కనకాలతో చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమాలోని మూడు జంటలు, దర్శకుడితో స్పెషల్ చిట్ చాట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇవాళ మీరు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలాగైనా మా వివాహ బంధాన్ని చక్కదిద్దమంటున్నారు? కొందరేమో మేము విడిపోతాము అంటున్నారు అని సుమ మూడు జంటల్ని అడుగుతుంది. ముందుగా సప్తగిరిని పిలిచి అసలు ప్రాబ్లమ్ ఏంటీ? అని అడుగుతుంది సుమ. దానికి సప్తగిరి బదులిస్తూ.. ఆదాయినికి మించి షాపింగ్ చేస్తుంది అక్కా అంటాడు. దీనికి నువ్వేం చెబుతావని సుమ అడగ్గా.. నేను అందంగా కనిపించాలి అంటారు, షాపింగ్ చేయనివ్వరని సప్తగిరి భార్య చెబుతుంది.

మరో జంటను అడగ్గా.. నా భార్యకు నా మీద అనుమానం ఎక్కువని అంటాడు రాజ్ కసిరెడ్డి. దానికి భార్య సమాధానం చెబుతూ... అందరితో పులిహోర కలుపుతాడు అలాంటప్పుడు అనుమానం కాక ఇంకేం వస్తుందని చెబుతుంది భార్య. దాంతో ఈసారి కలిపినప్పుడు నాకొక పులిహోర డబ్బా పంపించమని సుమ సెటైర్లు వేస్తుంది. మరో జంటను నీ ప్రాబ్లమ్ ఏంటని సుమ అడగ్గా.. పాత విషయాలను తవ్వి తవ్వి బయటకు తీస్తుందని చెబుతాడు భర్త... తనకు ఒకరు కాదు, ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని భార్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

ఈ రోజుల్లో ఒక్క గర్ల్ ఫ్రెండే కష్టమని అనుకుంటుంటే ఇతనికి ఇద్దరు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని సుమ షాక్ అవుతుంది. నాకు డైవర్స్ ఇప్పిస్తావు కదా అక్కా అని సప్తగిరి పదే పదే అడుగుతాడు. నేను చాలామంది కపుల్స్‌ని చూశాను కానీ మీ లాంటి వాళ్లాని మాత్రం చూడలేదని అంటుంది సుమ. అనంతరం దర్శకుడు వీరూని పిలిచి ఈ సినిమా సంగతుల గురించి అడుగుతారు. మా సినిమాలో మాట్లాడితే డైవర్స్ ఉంటాయి.. డైవర్స్‌తో పనిలేదు కుక్కర్‌లో ఉడకబెడుతున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారని సప్తగిరి చెప్పడంతో సుమ షాక్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరి ఈ జంటల మధ్య విడాకుల పంచాయతీని సుమ తీర్చిందో లేదో తెలియాలంటే ఫుల్ ఇంటర్వ్యూ చూసేయాల్సిందే.

Read more about: suma kanakala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X