బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.. అలా చేయొద్దు: యాంకర్ సుమ.. రియాక్ట్ అయిన రష్మీ

కరోనా.. కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ. ప్రపంచవ్యాప్తంగా జనమంతా ఆందోళన. ఊహించని విధంగా దేశవిదేశాలపై ఈ మహమ్మారి వైరస్ దాడి చేస్తుండటంతో పలువురు సెలెబ్రిటీలు స్పందిస్తూ.. దీనిపై ప్రజలకు ఓ అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ సుమ ఓ వీడియో ద్వారా కరోనాపై రియాక్ట్ అయింది. వివరాల్లోకి పోతే..

అన్నీ బంద్.. జనం అలెర్ట్

అన్నీ బంద్.. జనం అలెర్ట్

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఓ వైపు వైద్య ఆరోగ్యశాఖను రంగంలోకి దించి పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతూనే మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే జన సమూహం ఉండే ప్రదేశాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వణికిపోతున్న జనం.. రంగంలోకి సెలెబ్రిటీలు

వణికిపోతున్న జనం.. రంగంలోకి సెలెబ్రిటీలు

కరోనా కారణంగా జనం భయంతో వణికిపోతున్నారు. వేలాదిమంది బలి తీసుకోవడం, లక్షలాది మందికి సోకుతుండటంతో షాకవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో! అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలిస్తూ సెలెబ్రిటీలు రంగంలోకి దిగుతున్నారు.

కరోనాపై సుమ సూచనలు

కరోనాపై సుమ సూచనలు

తాజాగా యాంకర్ సుమ కరోనాపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. అందులో శానిటైజేర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ కనిపించి పరిశుభ్రత గురించి చెప్పుకొచ్చింది. కరోనా వైరస్‌ పట్ల తాను తీసుకుంటున్న జాగ్రత్తలు చెబుతూ పలు సూచనలు ఇచ్చింది.

బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.. అలా చేయొద్దు

బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.. అలా చేయొద్దు

వీలైనంత వరకు ఆల్కాహాల్ ఎక్కువగా ఉండే శానిటైజర్స్ వాడండి. పరిశుభ్రతే కరోనాను తరిమి కొట్టే అసలైన మార్గం. కరోనా పట్ల అస్సలు భయపడాల్సిన పనిలేదు. ముఖానికి మాస్క్‌లు ధరించడం, హగ్గులు, షేక్ హ్యాండ్స్ లాంటివాటికి దూరంగా ఉండటం మంచింది. బీ సేఫ్.. బీ రెస్పాన్సిబుల్ అని ఆ వీడియోలో సందేశమిచ్చింది సుమ.

Recommended Video

Anukunnadi Okati Ayinadi Okati : Dhanya Balakrishna, Siddhi Idnani Request To Audience

రష్మీ రియాక్షన్.. నెటిజన్స్ కామెంట్స్

కరోనా పట్ల యాంకర్ సుమ చేసిన వీడియో చూసి వెంటనే రియాక్ట్ అయింది రష్మీ. ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ మేరకు సుమ గారి మాటల్లో కరోనా జాగ్రత్తలు అని పేర్కొంది. ఈ వీడియో చూసిన జనం 'తప్పకుండా మేడం, అలాగే చేస్తాం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X