కేరళ వరదలు.. గొప్ప పని చేయబోతున్న యాంకర్ సుమ, రాజీవ్ దంపతులు!
యాంకర్ సుమ సొంత రాష్ట్రం కేరళ. ఇటీవల కేరళలో వరదలు అల్ల కల్లోలం సృష్టించాయి. తన సొంత రాష్ట్రంలో వరదలు వస్తున్నాయని ఆ మధ్యన సుమ చలించిపోయింది. తాజగా సుమ, రాజీవ్ కనకాల దంపతులు ఓ గొప్ప కార్యక్రమానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.
కేరళలోని అలిప్పి జిల్లాలో కన్నుమ్మ ప్రాంతంలో వైద్య కేంద్రం వరదలతో శిథిలావస్థకు చేరుకుంది. ప్రజలకు ఉపయోగపడే ఆ వైద్య కేంద్రాన్ని తిరిగి నిర్మించాలని రాజీవ్ కనకాల, సుమ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుమ దంపతులు కేరళ మంత్రిని కలిసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

కేరళ వరదల్లో నష్టపోయిన ప్రజలకు తమ వంతుగా సాయం చేసేందుకు వైద్య కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు సుమ దంపతులు తెలిపారు. తెలుగులో సుమ టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతున్నాడు.


Click it and Unblock the Notifications











